స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారికి ఫోన్లో యాప్స్ అనేవి చాలా అవసరం. ప్రతీ అవసరానికి కూడా మొబైల్ లో ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో చాలా యాప్స్ ఉంటాయి. మరి ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా
స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్ ఏమిటో తెలుసుకోండి.గూగుల్ ప్లేస్టోర్ ఇంకా యాపిల్ యాప్ స్టోర్‌లో 2021 వ సంవత్సరంలో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్ వివరాలను సెన్సార్ టవర్ రిలీజ్ చేయడం జరిగింది.
జనవరి నుంచి
జూన్ వరకు ఈ ఆరు నెలల్లో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన టాప్ 10 యాప్స్ ఇంకా వాటి వివరాలు తెలుసుకోండి.
1.Facebook:పెద్ద సోషల్
మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్ బుక్
గూగుల్ ప్లేస్టోర్‌లో టాప్ 1లో నిలవగా, ఇంకా యాపిల్ యాప్ స్టోర్‌లో ఫేస్ బుక్ 6వ స్థానంలో నిలిచింది.
2.TikTok:ఫేస్ బుక్ తరువాత స్థానంలో టిక్ టాక్ నిలిచింది. ఇక టిక్ టాక్ యాప్ ని ఇండియాలో బ్యాన్ చేసినా కాని ప్రపంచవ్యాప్తంగా మాత్రం దీని క్రేజ్ తగ్గలేదు. వరల్డ్ వైడ్ ఈ యాప్ టాప్‌లో నిలిచింది. ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లో టిక్ టాక్ యాప్ టాప్ యాప్ కాగా, ఇక
గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం రెండో స్థానంలో నిలిచింది.
3.Instagram:ఇక ఫోటో షేరింగ్ యాప్
ఇంస్టాగ్రామ్ గూగుల్ ప్లేస్టోర్,ఇంకా యాపిల్ యాప్ స్టోర్‌లో
ఇంస్టాగ్రామ్ 3వ స్థానంలో నిలిచింది.ఈ మధ్య రీల్స్ ఫీచర్ రావడంతో బాగా ఫేమస్ అయ్యింది.
4.WhatsApp:ఇక ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్
గూగుల్ ప్లేస్టోర్,యాపిల్ యాప్ స్టోర్‌లో 4వ స్థానంలో నిలిచింది.
5.Facebook Messenger:ఇక ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్ యాప్ మెసెంజర్ యాపిల్ యాప్ స్టోర్‌లో 7వ స్థానంలో నిలవగా ,
గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం 6వ స్థానంలో నిలిచింది.
6.Snapchat:ఇక స్నాప్‌చాట్
గూగుల్ ప్లేస్టోర్‌లో 7వ స్థానంలో నిలివగా యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రం కనీసం టాప్ 10 లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది.
7.Zoom:ఇక వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో 5వ స్థానంలో నిలవగా ,
గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం ఇది 8వ స్థానంలో నిలిచింది.
8.Google Meet:ఇక
గూగుల్ మీట్
గూగుల్ ప్లేస్టోర్‌లో 9వ స్థానంలో నిలవగా యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కించుకోలేకపోయింది.
9.YouTube:ఇక గూగుల్‌కు చెందిన వీడియో స్ట్రీమింగ్ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇంకా
గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం టాప్ 10 లో చోటు దక్కలేదు.
10.Gmail:ఇక
గూగుల్ ఇమెయిల్ సర్వీస్ యాపిల్ యాప్ స్టోర్‌లో 10వ స్థానంలో నిలివగా
గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కించుకోలేకపోయింది.