సూపర్ ఆఫర్.. ఒక్కరూపాయికే ఇయర్ బడ్స్
అందుకే అనేక పరిశోధనల తర్వాత ప్రోబడ్స్ ను రూపొందించినట్లు లావా తెలిపింది. కస్టమర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే చాల రకాల ట్రయల్స్ చేశాక తర్వాత ఈ డిజైన్ రూపొందించినట్టు సంస్థ వివరించింది. అయితే నిజంగానే ఒక్క రూపాయికే ఇయర్‌బడ్స్‌ను లావా సంస్థ అందించడం నిజంగా ఆశ్చర్యమే. రూపాయికే దీన్ని సొంతం చేసుకోవాలంటే రేపు మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాల్సిందేనండి.
లావా ఈ-స్టోర్ కానివ్వండి లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోగానీ గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఇక్కడొక రూల్ కూడా ఉంది. స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే రూపాయికి ఆఫర్ వర్తిస్తుందని లావా కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. తర్వాత దాన్ని కొనుగోలు చేసే వారు రూ.2,199 చెల్లించాల్సి ఉంది. ఇందులో 11.6 mm అడ్వాన్స్‌డ్ డ్రైవర్స్ తో పాటు గా మీడియా టెక్ ఏయిరో చిప్‌సెట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రతి బడ్ లో 55 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో పాటు అలాగే కేసులో 500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రోబడ్స్ తో పాటుగా లేటెస్ట్ బ్లూటూత్ v5.0 టెక్నాలజీ సపోర్ట్ ఉండటంతో పాటుగా 77 గ్రాముల బరువు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో వీటిని హైలెట్‌గా చూపించనుంది కంపెనీ.