"స్ట్రా" తో ఎక్కిళ్ళకు బ్రేక్..!

MOHAN BABU
"స్ట్రా" తో ఎక్కిళ్ళకు బ్రేక్..!
 టెక్నాలజీ పెరిగేకొద్ది ప్రతి ఒక్క సాధనం మనకు అందుబాటులోకి వస్తుంది. అదే మాదిరిగా ఇంకో వస్తువు అందుబాటులోకి వచ్చింది.  మనిషికి  సాధారణంగా ఎక్కిళ్ళు  వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇవి  చాలా ఇబ్బంది పెడతాయి. వీటి బారి నుండి ఉపశమనం పొందడానికి కొత్త సాధనం రాబోతోంది. ఈ సాధనాన్ని షాన్ అంటోనియాలోని  యూనివర్సిటీ అఫ్ టెక్సన్ హెల్త్ సైన్స్ వారు రూపొందించారు. అది ఏంటంటే  దా పోర్సుడ్ ఇన్స్పిరేటరీ సక్షన్ అండ్ స్వాలో టూల్ అనే సాధనాన్ని తయారు చేశారు.
దీనితో నీటిని స్వీప్ చేస్తే దాదాపు 92 శాతం ఎక్కిళ్ళను తగ్గిస్తుంది అని అధ్యయనంలో తేలిందన్నారు. ఎల్ షేప్ లో స్ట్రా మాదిరిగా ఉండే ఈ పరికరాన్ని ఒకవైపు మౌత్ పీస్, మరోవైపు చివరలో ప్రెషర్ వాల్స్ తో రూపొందించారు. ఈ స్ట్రాను పరిశీలించడానికి 250 మంది వాలంటీర్ల పై ప్రయోగం చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో  మూడింట రెండు వంతుల మందికి  నెలకు రెండుసార్లు ఎక్కిళ్ళు వస్తాయని 90 శాతం మందికి ఇతర చిట్కాల కంటే  ఈ స్ట్రా బాగా పని చేసిందని నెట్వర్కు ఓపెన్ జర్నల్ ద్వారా ఫలితాలు వెల్లడించింది.
ఈ పరికరం ద్వారా నీటిని పీల్చుకోవడానికి ప్రేనిక్ నరాలు డయాఫ్రొమ్ సంకోచించేలా చేస్తాయి. ఈ క్రమంలో నీటిని మింగేలా వాగస్ నాడి యాక్టివేట్ అవుతుంది. దీంతో ఎక్కిళ్ళను ప్రేరేపించే వాగస్, ప్రేనిక్ నరాలను బిజీగా ఉండడం వల్ల  ఎక్కిళ్ళు ఆగిపోతాయి. అయితే ఇది కొన్ని గంటల పాటు ప్రభావాన్ని చూపుతుందని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్   అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అలీ సిపి చెప్పారు. దీని ద్వారా  పూర్వకాలం చిట్కాల కంటే చాలా తొందరగా ఎక్కిళ్ల నుంచి మనం బయటపడవచ్చని, దీనిని  అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చని డాక్టర్ అలీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: