బుల్లిపిట్ట :టెలివిజన్ కంప్యూటర్ గా మార్చడం ఎలా..

Divya

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఈ టీవీ లే ఎంతో మంది ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. అయితే వాటిని  కంప్యూటర్ గా కూడా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా.. ? మనలో చాలా మంది కంప్యూటర్ అవసరమయ్యే ఎంతోమంది విద్యార్థులు,ఉద్యోగస్తులు టీవీ కూడా కంప్యూటర్ ల  పని చేస్తే ఎంత బాగుంటుందో అని ఆలోచించే వాళ్ళు లేకపోలేదు.. అయితే నిజమే త్వరలోనే మీ కల నిజం కాబోతోంది..కేవలం అతి తక్కువ ధరతో కంప్యూటర్ గా మార్చుకోవచ్చు మీ టీవీని. మరి మీ టీవీని , కంప్యూటర్ గా మార్చాలి అంటే కావలసిన  పరికరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
కేవలం 3200 రూపాయలతో మీ టీవీ ని కంప్యూటర్ గా మార్చుకోవచ్చు. అమెజాన్ ఇండియా వారు అతి తక్కువ ధరకే మినీ పీ సీ తో పాటు, ఎల్ సీ డీ , ఎల్ఈడీ  కంప్యూటర్ గా మార్చుకోవచ్చు. అయితే దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు. గ్రీన్ వీడీఐ 120 అల్ట్రా క్లయింట్ మినీ పీసీ ని అమెజాన్ ఇండియా వారు 54% రాయితీ తో మనకు అందిస్తున్నారు. ఇది ఒక తక్కువ బడ్జెట్, తక్కువ సామర్థ్యం గల మినీ కంప్యూటర్. దీని ద్వారా పిల్లలకు కంప్యూటర్ గురించి ఒక అవగాహన ఇవ్వడానికి సరిపోతుంది.
ఈ మినీ పీ సీ ప్రస్తుతం 3,200 రూపాయలకు లభిస్తోంది. ఇలా ఆఫర్ రావాలంటే అమెజాన్ బయ్ హియర్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. తద్వారా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
గ్రీన్ వీడీఐ120: స్పెక్స్
ఈ చిన్న కంప్యూటర్ లో 1.20GHZ A20  డబుల్ కోర్ ప్రాసెస్ ద్వారా  పనిచేస్తుంది. ఇందులో లో 512 ఎమ్బీ ర్యామ్ మాత్రమే కలిగి ఉంటుంది .మరియు 4జీబీ ఇంటర్నల్ మెమొరీ కలిగి ఉంటుంది. ఈ మినీ కంప్యూటర్ విండోస్ & లినక్స్ ఓ ఎస్ ల సపోర్ట్ తో పని చేస్తుంది. దీనిని టీవీకి కనెక్ట్ చేయడానికి 1HDMI కేబుల్ ,1VGA పోర్టు కలిగి ఉంటాయి. అంతేకాకుండా కీబోర్డ్, మౌస్ లాంటివి కనెక్ట్ చేసుకోవడానికి 3 USB 2.0 ఆప్షన్ కూడా కలదు. ఆడియో కోసం 1 మైక్రో ఫోన్ జాబ్ కలదు, అలాగే ఒక స్పీకర్ జాక్ కూడా కలదు. దీనికి రెండు సంవత్సరాల వారంటీ కూడా ఇవ్వబడింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: