ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ గా సాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ బడా బ్రాండ్ నుండి ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్స్ మార్కెట్ లోకి వస్తూనే ఉంటాయి. మొబైల్ ప్రేమికులు కూడా సాంసంగ్ బ్రాండ్ నుంచి వచ్చే ఫోన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సాంసంగ్ నుంచి 5జీ సపోర్ట్ తో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 5జీ స్మార్ట్‌ఫోన్ ఇటీవల చైనాలో రిలీజ్ అయింది. ఇక సాంసంగ్ ఎఫ్ సిరీస్ కు ఇండియా లో కూడా మంచి ఆధారణ ఉంది.
మీడియం బడ్జెట్ క్యాటగిరీలో ఎఫ్ సిరీస్ ను విడుదల చేస్తుంది సాంసంగ్. ఆ క్యాటగిరీలో ఇప్పటికే ఎఫ్40, ఎఫ్51 వంటి మొబైల్స్ విపరీతంగా సెల్ అయ్యాయి. అందువల్ల ఎఫ్52 5జీ కూడా ఇండియాలో కచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ ధర 1,999 చైనీస్ యువాన్లు. అంటే ఇండియన్ కరెన్సీ లోకి కన్వర్ట్ చేస్తే సుమారు రూ.23,000 వరకు ఉంటుంది. అయితే ప్రైజ్ విషయంలో కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఎఫ్ సిరీస్ మొబైల్స్ 20 వేల లోపే ఉన్నాయి. మరి ఒకవేళ ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ చేస్తే ప్రైజ్ విషయంలో కాస్త తగ్గించే అవకాశం ఉంది. ఇక ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే..
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 5జీ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.6 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే
ర్యామ్: 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ
రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ పోర్ట్‌రైట్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,500ఎంఏహెచ్ (25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + వన్ యూఐ 3.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ఇక ఈ మొబైల్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో లభించనుంది.