బుల్లిపిట్ట : అతి తక్కువ ధరకే 30,000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్..

Divya

పవర్ బ్యాంక్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఎందుకంటే ఒక్కసారిగా అనుకోకుండా ఎక్కడికైనా ప్రయాణాలు చేసినప్పుడు అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. పవర్ బ్యాంక్ కాకుండా  మనతోపాటు చార్జర్ తీసుకెళ్ళినా పబ్లిక్ ప్లేస్ లో ఛార్జింగ్ పెట్టుకోకూడదు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లకు మన డేటాను మనమే అందించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు వారితో పాటు పవర్ బ్యాంక్ ని తీసుకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. అయితే ఈ పవర్ బ్యాంక్ కూడా అతి తక్కువ బ్యాటరీ కెపాసిటీ,తో కేవలం ఒకటి రెండు సార్లకు మాత్రమే వచ్చేది. అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడేందుకు ఇప్పుడు వినూత్న ఆలోచన చేసింది షియోమీ  సంస్థ.. అయితే ఆ బ్యాటరీ కెపాసిటీ ఎంత? దాని ధర ఎంత? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ఇప్పటికే షియోమీ  సంస్థ రూపొందించిన ప్రో పవర్ బ్యాంక్ మనదేశంలో ప్రారంభమైంది. సాధారణంగా ఈ సంవత్సరం మార్చిలో ని దీనిని షియోమీ ప్రకటించింది. ఇది మార్చిలో ప్రకటించినప్పుడు దీని ద్వారా రూ.3,499 ఉండగా ఇప్పుడు ఇంకా అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం దీని ధర  2,299 రూపాయలకే విక్రయించడానికి షియోమీ నిర్ణయించుకుంది. ఇందులో రెండు యూ ఎస్ బీ టైప్- ఏ పోర్ట్ లు , ఒక యూ ఎస్ బీ టైప్- సీ పోర్టులు ఉండనున్నాయి. దీన్ని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉన్న ఫోన్ కు ఐదు సార్లు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి వున్న ఫోన్ కు 6 సార్లు చార్జింగ్ పెట్టవచ్చు. అంటే మొత్తం ఏకంగా ఈ పవర్ బ్యాంక్ 30,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.


అయితే ఇప్పటికే ఫ్లిప్కార్ట్ mi.కంప్లీట్, mi హోమ్ స్టోర్ అవుట్లెట్ లో కొనుగోలు చేయవచ్చు.. అంతేకాకుండా పవర్ డెలివరీ పాయింట్ ద్వారా 24 w  ఫాస్ట్ ఛార్జింగ్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే కేవలం 7.5 గంటల్లోనే దీనిని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: