బుల్లిపిట్ట: ప్రైమ్ యూజర్స్ కు గట్టి షాక్ ఇచ్చిన అమెజాన్ ?

Divya

ఇప్పుడు కరోనా సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూ టీవీ చూడడం అలవాటు చేసుకున్నారు. ఇక ఇలాంటి వారి కోసం కొత్త కొత్త సినిమాలను ఓటీటీ లో రిలీజ్ చేస్తుంటారు. అలాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో అమెజాన్ కూడా ఒకటి. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ యూజర్లకి గట్టి షాక్ ఇచ్చింది. నెలవారి సబ్స్క్రిప్షన్ ప్యాక్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అలాగే తన కొత్త కస్టమర్ల కోసం ఇచ్చే ఫ్రీ ట్రైల్  ఆఫర్లు కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

అమెజాన్ ప్రైమ్ యూజర్ లు  ఇకపై కేవలం మూడు నెలలు లేదా  ఏడాది గల ప్రైమ్ మెంబర్షిప్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఆర్ బీ ఐ నూతన మార్గదర్శకాలకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ వెల్లడించింది. రీఛార్జ్, ఓటీటీ, డీటీహెచ్ వంటి రికరింగ్ ఆన్లైన్ లావాదేవీల కోసం అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (  AFA )ను అమలు చేయాలని బ్యాంకులను, ఫైనాన్స్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో AFA నిబంధనలకు లోబడి, నెలవారి సబ్స్క్రిప్షన్  ప్లాన్ రూ.129 ని తొలగించినట్లు అమెజాన్ పేర్కొంది. ఇకపై ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకునే వారికి రూ.329 విలువచేసే మూడు నెలలు ప్లాన్, రూ. 999 విలువ గల యేడాది కాలం మాత్రమే అందుబాటులో తీసుకొచ్చింది. ఎవరైనా యూజర్స్ కొత్త ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకున్నవారు, లేదంటే పాత దాన్ని రెన్యువల్ చేసుకోవాలనుకున్నప్పుడు మూడు నెలలు లేదంటే ఏడాది సబ్స్క్రిప్షన్ మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని మార్చి 31 నుంచి అమలు చేయాలని ఆర్బీఐ భావించగా, బ్యాంకులు, పేమెంట్ గేట్ వేల వినతి తో దీన్ని సెప్టెంబర్ 30 వరకు వాయిదా వేసింది.
కరోనా వైరస్ తో వెబ్ సిరీస్ లతోపాటు సినిమాలను కూడా వాటిలో విడుదల చేస్తున్నారు. ఫలితంగా ఓటీటీ లకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: