రెడ్ మీ నుంచి మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ లాంఛ్..

Satvika
టాప్ మొబైల్ బ్రాండ్ లలో రెడ్ మీ ఫోన్లకు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇప్పటికే ఎన్నో ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.. ఇప్పుడు మరో ఫోన్ ను లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది.ఎంఐ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఇండియాకు పరిచయం చేయనుంది. చైనాలో రిలీజ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్లు పలు రికార్డుల్ని సృష్టించాయి. తొలి సేల్‌లోనే రూ.1,340 కోట్ల విలువైన ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయి. చైనాలో ఒకేసారి ఎంఐ 11 అల్‌ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 


ఇప్పుడు ఎంఐ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్టు షావోమీ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ ను ఏప్రిల్ 23 న మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉండగా కంపెనీ ఎన్ని ఫోన్లను విడుదల చేయనుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది..ఎంఐ 11 అల్‌ట్రా స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.81 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 48 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలీఫోటో సెన్సార్ + 48 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 


ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ వైర్‌లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో ధరల వివరాలు చూస్తే 8జీబీ+256జీబీ వేరియంట్ ధర సుమారు రూ.67,000 ఉండొచ్చని అంచనా. ఇక 12జీబీ+256జీబీ ధర సుమారు రూ.72,600, హైఎండ్ వేరియంట్ 12జీబీ+512జీబీ ధర సుమారు రూ.1,03,400 వరకు ఉండవచ్చునని జనాలు అంచనా వేస్తున్నారు. మరి ఈ ఫోన్ క్రేజ్ ఏ మాత్రం ఉంటుందో 23 న తెలియనుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: