వన్ ప్లస్ వాచ్ స్పెసిఫికేషన్స్ ఇవే..ధర కూడా అంతే?
ఇందులో ఐపీ68 సర్టిఫికేషన్, వార్ప్ చార్జ్ టెక్నాలజీ కూడా ఉండనుంది.చైనా రిటైల్ సంస్థ జేడీ.కాంలో ఈ వాచ్ లిస్ట్ అయింది. ఈ స్మార్ట్ వాచ్ ను ముందుగా బుక్ చేసుకొనే వారికి 50 నుంచి 600 వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. ప్రీ-ఆర్డర్ చేసుకుంటే ఈ వాచ్‌పై దాదాపు 110 రూపాయలు తగ్గింది .అయితే ఈ వాచ్ ధర మాత్రం చెప్పలేక పోయారు.ఈ వాచ్‌లో బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ ఉండనున్నాయి. మిగతా స్పెసిఫికేషన్లు తెలియాల్సి ఉంది. వన్ ప్లస్ వాచ్ డిజైన్ ఒప్పో వాచ్ ఆర్ఎక్స్ పోలిన. డివైజ్ ఉంటుంది.
46 మిల్లీమీటర్ల డయల్ ఉండనుంది. బ్లాక్, సిల్వర్ రంగుల్లో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్, ఎస్‌పీఓ2 సెన్సార్లు ఉండనున్నాయి. ఐపీ68 సర్టిఫికేషన్ కూడా ఇందులో ఉండనుంది. దీంతోపాటు ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఇందులో 4 జీబీ స్టోరేజ్ ఉండనుందని అర్థమవుతుంది.కేవలం 20 నిమిషాలు ఛార్జ్ చేస్తే దాదాపు వారం రోజుల పాటు వాడుకోవచ్చు. ఇందులో వేర్ ఆపరేటింగ్ సిస్టం కంటే మెరుగైన కస్టం ఆపరేటింగ్ సిస్టంను అందించనున్నట్లు వన్ ప్లస్ సహ వ్యవస్థాపకులు, సీఈవో పీట్ లా తెలిపారు. వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ప్రో, వన్ ప్లస్ 9ఆర్ ఫోన్లతో పాటు ఈ వాచ్ లాంచ్ కానుందని సమాచారం.. ఎప్పుడు లాంఛ్ అవుతుందా అని యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..