వివో నుంచి త్వరలో లాంఛ్ కానున్న ఫోన్లు ఇవే..

Satvika
మార్చి నెలలు కొత్త వస్తువులకు కొదవ లేదు.. మొబైల్ కంపెనీలు భారీ తగ్గింపు తో కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో వివో కంపెనీ కూడా కొత్త ఫోన్లను లాంఛ్ చేయనుంది. వివో ఎక్స్60, ఎక్స్60 ప్రో స్మార్ట్ ఫోన్లు చైనాలో గతేడాది లాంచ్ అయ్యాయి. తర్వాత జనవరిలో ఎక్స్60 ప్రో ప్లస్ కూడా అక్కడ లాంచ్ అయింది. ఇప్పుడు వివో ఈ ఎక్స్60 సిరీస్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది.. ఇకపోతే ఈ నెలలోనే ఈ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. ఈ ఫోన్లు దాదాపు 40 వేలకు పైన ఉంటుంది.. వివో ఎక్స్ 60 ధర 39,290 ఉండగా, వివో ఎక్స్ 60 ప్రో రూ.50,510 ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ దశ 56 వేలకు పైన ఉంటుంది.


వివో ఎక్స్ 60 :

యాస్పెక్ట్ రేషియో 19.8:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్‌గా ఉంది. హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10+ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ ఎక్సినోస్ 1080 ప్రాసెసర్‌పై వివో ఎక్స్60 పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 1.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 13 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి..


వివో ఎక్స్ 60 ప్రో:


స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్‌గా ఉంది. ఆక్టాకోర్ ఎక్సినోస్ 1080 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌నే ఇందులో కూడా అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 1.0 ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎక్స్60 ప్రో పనిచేయనుంది.వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 13 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. వీటి ఫీచర్లు ఆన్ లైన్ లో లీక్ అయిన సంగతి తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: