గ్లూ ను ఉపయోగించి పుండ్లను, గాయాలను మూసి వేయొచ్చా..?
గ్లూ ని ఉపయోగించి, పుండ్లు, గాయాలను మాన్పు తారా? ఇదెక్కడి విడ్డూరం..! ఆశ్చర్యపోతున్నారా..? అవును నిజమండి ఇప్పుడు చెప్పబోయే ఒక గ్లాస్ ని ఉపయోగించి మన శరీరంపై ఏర్పడ్డ పుండ్లను, గాయాలను ఇట్టే మాన్పేయచ్చట. ప్రస్తుత కాలంలో మనం ఉండే సమాజంలో ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొంత మంది చనిపోతారు,మరి కొంత మంది గాయాలపాలవుతున్నారు. ఈ గాయాలు మానడానికి ఎంతో సమయం పడుతోంది. ఇక అంతే కాక చలికాలంలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ, ఎన్నో బాధలు పడాల్సిన పరిస్థితి వస్తుంది.
దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు,పుండ్లు మానడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాలలో కుట్లు కూడా వేయవలసి వస్తుంది. కానీ ఇకపై అలాంటి అవసరం లేకుండా ఉండేందుకు వీలుగా సైంటిస్టులు ఓ అద్భుత ఆవిష్కరణ నూ సృష్టించారు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
అమెరికాకు చెందిన "బయో మెడికల్ ఇంజనీర్లతో పాటు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన పరిశోధకులు గ్లూ 'గమ్ 'ను" అభివృద్ధి చేశారు. దానికి "మెట్రో" గా నామకరణం చేశారు. సదరు గ్లూ ను గాయాలపై అప్లై చేయగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే, ఇది గాయాలను సీజ్ చేస్తుంది. దీంతో గాయం అయిన ప్రాంతం క్లోజ్ అవుతుంది. ఫలితంగా గాయం త్వరగా మానుతుంది.
అయితే గ్లూ ని అప్లై చేశాక, అల్ట్రావయోలెట్ కిరణాల సాయంతో దీన్ని ఆక్టివేట్ చేయాలి. అలా ఆక్టివేట్ అయిన తర్వాత గ్లూ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇక దీన్ని ఇప్పటికే మన చుట్టూ ఉండే జంతువుల పైన, పందులు, ఇతర జీవుల పైన ప్రయోగించి విజయం సాధించారు. దీంతో త్వరలోనే మనుషులపై ఒక ట్రైలర్ చేపట్టనున్నారు. ఆ తర్వాత గ్లూ వాణిజ్య పరంగా మొత్తం దేశమంతటా మార్కెట్లోకి వస్తోంది.
ప్రస్తుతం ఈ గ్లూ కు చెందిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ గ్లూ కి సంబంధించిన వీడియోను ప్రముఖ బయో ఫార్మా సూటికల్స్ ఎంటర్ప్రైజ్ బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మంజు దర్శన్ షేర్ చేశారు.
ఇక త్వరలోనే ఈ గ్లూ అందుబాటులోకి వస్తే, గాయాలపాలైన వ్యక్తులు ఎలాంటి బాధలు పడవలసిన అవసరం వుండదు.