"బుల్లిపిట్ట " ఈ పదాలు గూగుల్ లో వెతికితే ఇక జైలుకే..
ప్రస్తుత కాలంలో సంభవిస్తున్న మార్పులకనుగుణంగా స్మార్ట్ టెక్నాలజీ తో పాటు స్మార్ట్ ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం కూడా అంతే స్థాయిలో పెరిగింది . ఇక ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగించడం ఎక్కువయింది. మారుతున్న కాలం కొద్ది, ఏ చిన్న ప్రశ్న ఎదురైనా, దానిని నివృత్తి చేసుకోవడానికి గూగుల్ బాట పడుతున్నారు . ఇక చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ సందేహాలను, ఈ స్మార్ట్ ఫోన్ లో ఉండే గూగుల్ ఇంటర్నెట్ ద్వారా వారి ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కుంటున్నారు . ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్,కంప్యూటర్లు చాలానే ఉన్నాయి. అందులో మన దిగ్గజ నెట్వర్క్ అయిన జియో డేటా చౌకగా దొరకడం వల్ల,అందరూ డేటా ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు అందరూ ఒకే విషయం గురించి ఆన్లైన్లో వెతికరు కదా..! ఒక్కొక్కరు ఒక్కో విషయం గురించి వెతుకుతారు. తమకు వున్న ఇంటరెస్ట్ ను బట్టి వారు,గూగుల్లో శోధిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏ వర్డ్ గురించి వెతికినా తప్పులేదు కదా,అని ఏది పడితే, దానిని గూగుల్ లో సెర్చ్ చేసారో ఇక అంతే.. త్వరలోనే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే కొన్ని విషయాలను గూగుల్ లో సెర్చ్ చేయకూడదట..అయితే ఆ వర్డ్స్ ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
మొదట ఫోర్ గర్ల్స్ ఫింగర్ పెయింట్, లెమన్ పార్టీ, బ్లూ వాల్ఫ్, కిడ్స్ ఇన్ ఎ శాండ్ బాక్స్, ఎలె గర్ల్, టూబ్ గర్ల్, టు గర్ల్స్ ఇన్ వన్ కప్ తదితర పదాలను గూగుల్లో వెతకకూడదట. ఇంగ్లీషులో అలాంటి పదాలు చాలానే ఉన్నాయి ఏ టు జెడ్ వరకు. అలాంటి పదాలు వెతికినా గూగుల్ ఫలితాలను చూప దట. అలా సాఫ్ట్ వేర్ ను తీర్చిదిద్దారు గూగుల్ డెవలపర్స్ .
ఇంతకీ వీటి గురించి ఎందుకు వెదకకూడదు అని అనుకుంటున్నారా..? అవి మిక్కిలి అశ్లీలమైన పదాలు,చదివేందుకు అంత అశ్లీలంగా లేకున్నా,వాటితో చాలామంది అశ్లీల చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారట. అందుకే గూగుల్ వీటిని తన లిస్ట్ లో నుంచి తీసి వేసింది.
అంతేకాకుండా టెర్రరిజానికి చెందిన పదాలను కూడా గూగుల్ లో వెతకకూడదట. అలాగని వెతికితే వాళ్ల మీద ఒక నిఘా వ్యవస్థ ఒక కన్నేసి ఉంచి, అవసరం వస్తే అలాంటి వారిని అరెస్ట్ చేస్తుందట. కాబట్టి అలాంటి పదాలు వెతుకుతుంటే,ఇకపై వాటిని అలా వెతకడం ఆపేయండి. లేదంటే మీకు ముప్పు తప్పకపోవచ్చు.