గుడ్ న్యూస్: తక్కువ ధరలో ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్..!
రెండు కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌తో పాటు వివో ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇక 7.9ఎంఎం సైజ్‌లో ఉండే సన్నని స్మార్ట్‌ఫోన్ 6.52 అంగుళాల వాటర్‌డ్రాప్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. అయితే 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్డీ+ రెజల్యూషనల్, ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ చిప్సెట్ లాంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లో పొందుపర్చారు. ఫ్రంట్ కెమెరాలో నేచురల్ బ్యూటీ, ఏఐ బ్యూటిఫికేషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక కలర్ ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టమ్‌లో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్, త్రీడి ఫింగర్ స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ లాంటి ఫీచర్స్ ను ఈ స్మార్ట్ ఫోన్ అందించనుంది.
ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఫోన్ డిస్ప్లే 6.52 అంగుళాల హెచ్డీ+డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ర్యామ్ 2జీబీ ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీ ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో పీ35 ఉంటుంది. రియర్ కెమెరా 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా+2 మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా+2మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ ను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సల్ ఉంది. బ్యాటరీ 4230 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ కలర్ ఓఎస్ 7.2 + ఆండ్రాయిడ్ 10ను అందించారు. సిమ్ సపోర్ట్ డ్యూయెల్ సిమ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కలర్స్ డైనమిక్ బ్లాక్, మిస్టరీ బ్లూ వంటి రంగుల్లో ఉన్నాయి.