బుల్లిపిట్ట: జెడ్‌టీఈ బ్లేడ్ 20 5జీ ఫోన్ ధర, ఫీచర్స్ వివరాలు ఇవే...!

Suma Kallamadi
మీరు కొత్త ఫోన్ ని కొనుగోలు చెయ్యాలనుకుంటున్నారా...? అయితే ఈ జెడ్‌టీఈ బ్లేడ్ 20 5జీ  ఫోన్ ధర, ఫీచర్స్ చూడాల్సిందే... చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ జెడ్‌టీఈ తన కొత్త 5జీ ఫోన్ జెడ్‌టీఈ బ్లేడ్ 20 5జీని లాంచ్ చేసింది. పూర్తి వివరాలు ఇవే.....   5జీ ఫీచర్‌తో  వచ్చిన ఈ ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది. ఇందులో 6.52 అంగుళాల డిస్ ప్లేను అందించారు. దీని పిక్సెల్ రిజల్యూషన్ 720x1600గా ఉంది. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఫోన్ కెమెరా విషయానికి వస్తే.... వెనకవైపు మూడు కెమెరాల సెటప్ కూడా ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే... 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

ఫోన్ ధర వివరాల్లోకి వెళితే... ఇందులో కేవలం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను 1,499 యువాన్లుగా (సుమారు రూ.16,700) నిర్ణయించారు. కలర్స్ విషానికి వస్తే...జాజీ గ్రే, లైట్ బ్లూ మింట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇది ఇలా ఉండగా యాక్సెలరో మీటర్, గైరో సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.



 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: