
బుల్లిపిట్ట: మోటో ఈ7 ధర, ఫీచర్స్ వివరాలు ఇవే...!
ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే..... వెనక వైపు రెండు కెమెరాలున్నట్లు తెలుస్తోంది. వెనకవైపు 13 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు అందించారు. ఇక సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీని ప్రాసెసర్‌కు సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. టీయూవీ సర్టిఫికేషన్ ప్రకారం ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. 5W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది. ఈ ఫోన్ XT2095-3 అనే మోడల్ నంబర్‌తో కనిపించింది.
మోడల్ నంబర్ తప్ప దీని గురించి మిగతా వివరాలేవీ తెలియలేదు. ఇది ఇలా ఉండగా మోటో ఈ7లో మరో వేరియంట్ XT2095-1 మోడల్ నంబర్‌తో ఎఫ్‌సీసీ వెబ్ సైట్లో కనిపించింది. దీని ప్రకారం ఈ ఫోన్ యాక్సెసరీలు అయిన ఏసీ అడాప్టర్, బ్యాటరీ, ఇయర్ ఫోన్, యూఎస్‌బీ కేబుల్‌ను ఇస్తున్నట్టు అర్ధం అవుతోంది. దీని ధర విషయం లోకి వస్తే..... మోటో ఈ7 ప్లస్ ధరను రూ.9,499గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని ధర కాస్త తక్కువ గానే ఉండనుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే...... 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండవచ్చు. వైఫై, ఎల్టీఈ, జీపీఎస్, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌ను కూడా ఇందులో అందించనున్నారు. వెనకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.