బుల్లిపిట్ట: నాలుగు మోడళ్లలో యాపిల్ ఫోన్స్ లాంచ్.....! ధర, ఫీచర్స్ ఇవే...
ఈ స్మార్ట్ ఫోన్స్ స్టోరేజ్ ప్రకారం వాటి ధర ఇలా ఉంది. 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 12 mini ధర భారత్‌లో రూ. 69,900 ఉంది. కానీ అదే ఫోన్‌ను 256 జీబీ వేరియంట్ కొనాలనుకుంటే దాని ధర రూ. 84,900 ఉంది. మరి స్టోరేజ్ ప్రకారం చూస్తే వీటి ధర కొంచెం ఎక్కువ అనే అనాలి. అదే విధంగా 512 జీబీ స్టోరేజ్ ఐఫోన్ 12 Pro Max ధర రూ. 1,59,900 ఉంది. ఐఫోన్ 12 mini ప్రపంచంలో 5జీ సాంకేతికత గల అతి చిన్న ఫోన్ అవుతుంది. అలానే ఇప్పుడు అన్ని ఐఫోన్‌లలోనూ పెద్ద స్క్రీన్ కలిగి ఉంటోంది. ఐఫోన్ 12 స్క్రీన్ కూడా ఇంతకు ముందు ఫోన్ల కంటే పెద్దదిగా ఉంటుంది.
మొట్ట మొదటిసారి ఈ సిరీస్ ఫోన్లలో దేనితోనూ హెడ్ ఫోన్స్, చార్జర్ ఇవ్వడం లేదు. పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించడానికి తమ నిర్ణయం సహకరిస్తుందని యాపిల్ చెప్పింది. ఫ్లాష్ లేకుండానే చీకట్లో సెల్ఫీ తీసుకోవచ్చు అని కూడా తెలియజేసారు. అలానే కలర్, కాంట్రాస్ట్, ఆడియో విషయంలో కూడా కొత్త ఫోన్ ఫీచర్లు ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉన్నాయంది.