గుడ్ న్యూస్: శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 ప్రీ-ఆర్డర్..!

Kothuru Ram Kumar
మీరు ఫోన్ కొనుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇది మీకు గుడ్ న్యూస్. ఇక శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 వై-ఫై వేరియంట్ ను ఇకపై ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చునని సంస్థ యాజమాన్యం తెలిపారు. అమెజాన్ వెబ్ సైట్ లో ప్రీ-ఆర్డర్ చేస్తే అతి త్వరలో మీ ముందుకు రానుందని తెలిపారు. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను ఉంచారు. సింగిల్ ర్యామ్ స్టోరేజీ కాన్ఫిగరేషన్ తో అందుబాటు లోకి వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 మూడు రంగుల్లో వచ్చిందని తెలిపారు.

అయితే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 వై-ఫై ధరను భారత్ లో రూ.17,999 ఉంటుందన్నారు. ఇక 3జీబీ+32జీబీ స్టోరేజీ మోడల్ ధరను 17999గా నిర్ణయించారు. గ్రే, గోల్డ్, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉందని తెలిపారు. అమెజాన్, శాంసంగ్.కామ్ లలో అమ్మకానికి పెట్టారు. అక్టోబర్ 12 నుండి ట్యాబ్ ను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. ఇక శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 వై-ఫై వేరియంట్ ను ప్రీ ఆర్డర్ చేస్తే బుక్ కవర్ ను 1875 రూపాయలకే ఇవ్వనున్నారు. సాధారణంగా దీని ధర 4499 రూపాయలు. ఇక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులకు 1500 రూపాయల ఆఫర్ ఉందన్నారు.

అంతేకాదు శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 ఆండ్రాయిడ్ 10 బేస్ మీద పని చేస్తుందన్నారు. ఇక 10.4-inch WUXGA+ (2,000x1,200 pixels) TFT డిస్ ప్లే ఉందన్నారు. ఇక ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 662 ఎస్.ఓ.సి. మీద పని చేస్తుంది. 3 జీబీ ర్యామ్ తో పాటూ.. 32 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీ కూడా ఉంది. మైక్రో ఎస్.డి. కార్డు ద్వారా 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఉంది.. Wi-Fi, Bluetooth 5.0, GPS, Glonass, Beidou, Galileo, a 3.5mm హెడ్ ఫోన్ జాక్,  USB Type-C పోర్టు కూడా ఉంది. 7040ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. ఈ ట్యాబ్ బరువు 476 గ్రాములు ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: