బుల్లిపిట్ట: నోకియా 3.4 ధర, ఫీచర్స్ చూడాల్సిందే...!

Suma Kallamadi
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా  కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ నోకియా 3.4 ఫీచర్స్ వినియోగదారులని ఆకట్టుకునేలా ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..... నోకియా 3.4 హెచ్‌డీ+ డిస్ ప్లేలు, వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్లు, నార్డిక్ కలర్ ప్యాలెట్లు ఉన్నాయి.  అలానే నోకియా 3 సిరీస్‌లో మొదటి సారి వెనకవైపు మూడు కెమెరాలు, ముందు వైపు పంచ్ హోల్ కెమెరాతో లాంచ్ అయన ఫోన్ ఇదే కావడం విశేషం.
వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ గా ఉంది. దీంతో పాటు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందు వైపు 8 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరా అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. మరి ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.... ధర 159 యూరోలుగా(సుమారు రూ.13,700) ఉంది. రంగులు లోకి వస్తే....చార్ కోల్, డస్క్, ఫోర్డ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ ని కోలుగోలు చేయననుకుంటే మాత్రం  అక్టోబర్ వరకు ఆగక తప్పదు. దీని సేల్ అప్పటి నుంచే ప్రారంభం కానుంది.  6.39 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. అలానే దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 19.5:9 గా ఉంది.  స్టోరేజ్ విషయానికి వస్తే...4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం పై పని చేయనుంది. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: