బుల్లిపిట్ట: భారతదేశంలో లాంచ్ కానున్న టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్, స్పెసిఫికేషన్లు మీకోసం!

Suma Kallamadi
టెక్నో మొబైల్ కంపెనీ ఈ రోజు భారతదేశంలో ఓ సరికొత్త కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నది. అయితే ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ పేరు టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ కాగా... ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈ రోజ సాయంత్రం లోపు అధికారికంగా విడుదల అవుతుందని తెలుస్తోంది. ప్రముఖ టెక్నాలజీని జర్నలిస్టుల ప్రకారం 3జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నల్ మెమొరీ కలిగిన ఈ ఫోన్ ధర అక్షరాల 8,499 రూపాయలు.  ఫ్లిప్‌కార్ట్ ఈకామర్స్ వెబ్ సైట్ లో సెప్టెంబర్ 14 తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

ఇక ఫ్లిప్ కార్ట్ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ ఒక్కసారి చార్జ్ చేస్తే నాలుగు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందించనుంది. వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్, 7 అంగుళాల భారీ డిస్ ప్లేను కూడా ఇందులో అందించారు. దీని ధర రూ.9 వేల లోపే ఉండనుంది. దీనికి #PowerPlayEntertainment అనే హ్యాష్ ట్యాగ్‌ను అందించారు. కాబట్టి ఈ ఫోన్ భారీ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను అందించనున్నారు.

అయితే జూన్ లో టెక్నో స్పార్క్ పవర్ 2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.9,999గా ఉంది. ఇందులో 7 అంగుళాల భారీ డిస్ ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90.6 శాతంగా ఉంది. ఆండ్రాయిడ్ ఆధారిత హైఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ ను ఇందులో అందించారని నిపుణులు తెలిపారు.

ఇక ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ను అందించారు. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చునన్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. ముందువైపు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: