బ్యాటరీ ఆ మజాకా... ఒక్కసారి చార్జ్ చేస్తే 28 ఏళ్ల వరకు !

Kothuru Ram Kumar
బ్యాటరీ అంటే మనకు తెలిసి ఎక్కడైనా ఏడాది, ఇక రెండేళ్లు వాడుతారు. ఇక ఎంతో ఖరీదు పెట్టి కొంటే మరో ఆరు నెలలో వస్తుంది. అయితే కాలిఫోర్నియాకు చెందిన 'ఎన్‌డిబి' అనే సంస్థ తయారు చేసిన బ్యాటరీ ఒకటి , రెండేండ్లు కాదు ఏకంగా 28 వేల సంవత్సరాల పాటు పనిచేస్తుందని నిపుణులు తెలిపారు. ఇక అణువ్యర్థాలతో తయారు చేసిన ఈ బ్యాటరీతో జీవిత కాలం చార్జింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఒకసారి చార్జ్ చేస్తే.. ఇక జీవితంలో చార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాలు, సెల్యులార్ ఫోన్లు, గడియారాలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, మానిటర్లు, సెన్సార్లు మొదలైన అనేక రకాల పరికరాలను ఈ బ్యాటరీ ద్వారా పనిచేస్తాయని ఎన్‌డిబి పేర్కొంది. ఈ బ్యాటరీ యుటిలిటీ చాలా విస్తృతమైనది. ఈ బ్యాటరీ పూర్తిగా సురక్షితం అని కంపెనీ వెల్లడించింది. దీని కోసం రేడియోధార్మిక యాంటీ డైమండ్ పూత వేసామని, ఇది లీకేజీని నివారిస్తుందని తెలిపింది. ఇది ఎలా పని చేస్తుంది? ఈ బ్యాటరీ స్వయంచాలకంగా దాని లోపల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. యాంటీ రేడియోధార్మిక వజ్రాల విషయంలో రేడియోధార్మిక మూలకాల వల్ల ఏర్పడే ఎలక్ట్రాన్ల వల్ల ఇది జరుగుతుంది.  

ఈ బ్యాటరీ స్వయంచాలకంగా దాని లోపల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. యాంటీ రేడియోధార్మిక వజ్రాల విషయంలో రేడియోధార్మిక మూలకాల వల్ల ఏర్పడే ఎలక్ట్రాన్ల వల్ల ఇది జరుగుతుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ బ్యాటరీల జీవితకాలం 28000 సంవత్సరాలకు పైగా పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ బ్యాటరీని ఓ కృత్రిమ వజ్రంతో తయారు చేసిన చిన్న పెట్టెలో కార్బన్ -14 అణు వ్యర్థాలతో ఎన్‌డిబి సంస్థ దీనిని తయారు చేసింది. అయితే రేడియోధార్మిక వ్యర్థాలను కూడబెట్టుకోవడం, బ్యాటరీలను ఉత్పత్తి చేయడం ప్రస్తుతం చాలా ఖర్చుతో కూడిన పని అని, దీనికి మరింత ఆర్థిక సహకారం కావాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: