టెక్నాలజీ: భారత్‌లో షియోమీ నుండి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఇవే?
ఎంఐ 10ఐ లైట్ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరింయట్లు ఉండనున్నట్టు సమాచారం. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఎంఐ నోట్ 10 లైట్‌లో 6.47 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అమర్చారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. అందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి.
సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ ఫ్రెంట్ కెమెరాను అందించారు. 5260 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇందులో ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తోంది. అలాగే ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వెనకవైపు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మిడ్ నైట్ బ్లాక్, నెబ్యులా పర్పుల్, గ్లేసియర్ వైట్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే.. 6 జీబీ ర్యామ్ +64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 349 యూరోలు (అంటే సుమారు రూ.30,800)గా, 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 399 యూరోలు (అంటే సుమారు రూ.35,200)గా నిర్ణయించారు. అయితే భారత్‌లో మాత్రం ఈ ఫోన్ రూ.25 వేల రేంజ్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.