బుల్లిపిట్ట: ఆశ్చర్యపరుస్తున్న శాంసంగ్ గెలాక్సీ M31s స్పెసిఫికేషన్స్....!

Suma Kallamadi
తన అద్భుత స్పెసిఫికేషన్లతో ప్రపంచాన్ని ఆశ్యర్యపరచడానికి సిద్ధంగా ఉంది శాంసంగ్ గెలాక్సీ  M31s . నిజంగా ఈ ఫోన్ అందర్నీ అవాక్ అయ్యేలా చేసింది. దీనిలో  Intelli-Cam మరియు Single Take కెమెరా తో పాటు ఇందులోని అనేక రకాల ఇతర ఫీచర్లు కూడా ఉండడం విశేషం. ఇలా అద్భుతమైన ఫీచర్స్ ఏ డివైస్‌ పవర్ హౌస్‌గా నిలబడడానికి కారణం. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే....

ఈ ఫోన్ ప్రారంభం ధర కేవలం రూ. 19,499 మాత్రమే. ఈ ఫోన్ గురించి అనేక చర్చలు సాగుతున్న సంగతి తెలిసినదే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో MonsterShot శాంసంగ్ గెలాక్సీ  M31s గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు అంతా. ఈ ఫోన్ లో మరో అద్భుతం ఏమిటంటే  10 రకాలుగా (7 పిక్చర్స్ మరియు 3 వీడియోలు) కాప్చర్ చేసే సింగల్ టేక్ ఫీచర్. ఈ ఫీచర్ కూడా ఆకర్షిస్తోంది.  సింగల్ టేక్   ఫీచర్ అనేక రకాల బెస్ట్ సెలక్షన్ పిక్చర్, స్మార్ట్ క్రాప్ ఫోటో, ఆల్ ఫిల్టర్, ఒరిజినల్, హైపెర్లాప్స్  మరియు బూమేరాంగ్ వీడియో ఆప్షన్లు కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి.

అలానే ఈ ఫోన్  20K లోపు బడ్జెట్ ‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ డివైస్‌గా నిలిచింది.  ప్రస్తుత తరం యొక్క అన్ని సోషల్ మీడియా అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫోన్ ని తయారు చేసారు. దీని వలన మంచి కెమెరా ఫీచర్స్ కలిగిన ఫోన్ కొనుగోలు చెయ్యాలనుకుంటే ఎక్కువ ధరను ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. సోనీ IMX682 సెన్సె తో ఉన్న ప్రధాన కెమెరా 64MP Intelli-Cam మరియు 12MP అల్ట్రావైడ్  లెన్స్ తో ఉంది. క్వాడ్-కెమెరా ద్వారా మాన్స్టర్ షాట్ కూడా వస్తుంది. అంతే కాకుండా చక్కని బొకే షాట్స్ కోసం 5MP డెప్త్ సెన్సర్,  క్లారిటీతో కాప్చర్ చెయ్యడానికి 5MP మాక్రో లెన్స్ ను ఈ ఫోన్ లో కలిగి ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: