జియో వినియోగదారులకు షాకింగ్ న్యూస్.... ఆ ప్లాన్స్ రద్దు....?
దేశీయ టెలీకాం దిగ్గజం జియో వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. జియో తీసుకున్న నిర్ణయం వల్ల జియో ఫోన్ యూజర్లు నష్టపోనున్నారు. అత్యంత తక్కువ విలువ గల రూ. 49 మరియు రూ. 69 ప్లాన్లను జియో తొలగించింది. బేసిక్ ప్లాన్లను జియో తొలగించడంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఈ ప్లాన్ల వల్లే జియో ఫోన్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో కోట్ల సంఖ్యలో జియో ఫోన్ యూజర్లు ఉన్నారు.
ఫీచర్ ఫోన్లలో జియో ఫోన్ అత్యధిక వాటాను కలిగి ఉంది. 49 రూపాయల ప్లాన్ లో 14 రోజుల వ్యాలిడిటీతో పాటు 2 జీబీ డేటా వచ్చేది. జియో నుంచి జియో అన్ లిమిటెడ్ కాలింగ్, 250 నిమిషాల జియో నుండి నాన్ జియో నిమిషాలు, 25 ఉచిత మెసేజ్ లు లభించేవి. 69 రూపాయల ప్లాన్ లో 14 రోజుల వ్యాలిడిటీతో పాటు 7 జీబీ డేటా వచ్చేది. జియో నుంచి జియో అన్ లిమిటెడ్ కాలింగ్, 250 నిమిషాల జియో నుండి నాన్ జియో నిమిషాలు, 25 ఉచిత మెసేజ్ లు లభించేవి.
అయితే జియో తాజాగా 49, 69 రూపాయల ప్లాన్లను తొలగించి 75 రూపాయల ప్లాన్ ను తీసుకొచ్చింది. జియో ఈ ప్లాన్ ను ఆల్ ఇన్ వన్ ప్లాన్ కింద జియోఫోన్ కేటగిరీలో ఉంచింది. జియో ఫోన్ కు ఈ మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది. జియో రద్దైన ప్లాన్లను జియో.కాం, మైజియో యాప్ ల నుంచి తొలగించింది. అయితే 75 రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే మొత్తంగా 3 జీబీ డేటా, జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 500 నిమిషాలు, మొత్తంగా 50 ఎస్ఎంఎస్ లభిస్తాయి.
ఈ ప్లాన్ల ద్వారా జియో అప్లికేషన్లకు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. మొదట్లో చౌకైన ప్లాన్ల ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్న జియో ఇప్పుడు రెండు ప్లాన్లను తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే 75 రూపాయల ప్లాన్ ద్వారా వ్యాలిడిటీ పెరగడం వల్ల యూజర్లకు ప్రయోజనం చేకూరుతోంది. అయితే కేవలం 3జీబీ డేటా మాత్రమే లభించనుండటంతో ఎక్కువ డేటా పొందాలంటే ఆడ్ ఆన్ ప్యాక్ లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది,