టెక్నాల‌జీ: త్వ‌ర‌లోనే లాంచ్ కానున్న `మోటో ఈ7`.. ధ‌ర కూడా రూ.10 వేలలోనే..?‌

Kavya Nekkanti

ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విప‌రీత‌మైన పోటీ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. కంపెనీలు ఒకదానికితో మరొకటి పోటీ పడుతూ సరికొత్త టెక్నాలజీతో వినూత్నమైన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువ‌స్తున్నారు. అయితే మ‌న ఇండియ‌న్ మార్కెట్‌లో బ‌డ్జెట్ ఫోన్ల‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ క్ర‌మంలోనే ప‌లు కంపెనీలో బ‌డ్జెట్ ధ‌ర‌లోనే ఫోన్లు ఆవిష్కరిస్తూ.. మంచిగా క్యాష్ చేసుకుంటున్నారు. ఇక త్వ‌ర‌లోనే మ‌రో బ‌డ్జెట్ ఫోన్ లాంచ్ కానున్న‌ట్టు తెలుస్తోంది. అదే మోటో ఈ7.

 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కెనడాకు చెందిన ఫ్రీడం మొబైల్ లో మోటో ఈ7 స్మార్ట్ ఫోన్ ద‌ర్శ‌న‌మిచ్చింది. దీనిని బ‌ట్టీ చూస్తుంటే.. త్వ‌ర‌లోనే ఈ ఫోన్ విడుదల కానున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ వెబ్ సైట్లో దీని ధరను 189 కెనడా డాలర్లు (అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో సుమారు రూ.10,400) గా పేర్కొన్నారు. మ‌రియు 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రం ఈ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. ఇక లీకైన స‌మాచారం ప్ర‌కారం మోటో ఈ7 స్పెసిఫికేష‌న్లు చూస్తే.. ఇందులో  6.2 అంగుళాల స్క్రీన్ అందించ‌నున్న‌ట్టు స‌మాచారం.

 

అలాగే మోటో ఈ7 స్మార్ట్ ఫోన్ లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 3550 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది.  క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో ఈ స్మార్ట్‌ఫోన్ ప‌నిచేయ‌నుంది. ఫోన్ వెనకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, మోటొరోలా లోగో కూడా ఇందులో ఉన్నాయి. ఇక కెమెరా విష‌యానికి వ‌స్తే.. మోటో ఈ7 వెన‌క‌వైపు రెండు కెమెరాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ రెండు కెమెరాలు 13 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యం ఉండ‌గా.. ముందువైపు సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా అందించ‌నున్నారు. మ‌రియు ఈ ఫోన్ కేవలం బ్లూ రంగులో మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. మ‌రి మోటొరోలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు విడుద‌ల చేస్తుందో ప్ర‌క‌టించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: