టెక్నాల‌జీ: మీకు సంబంధించిన ఈ ముఖ్య విషయాలను ఎవ్వరికీ తెలీ‌నివ్వ‌కండి..!!

Kavya Nekkanti

ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్‌ఫోన్ ద‌ర్శ‌న‌మిస్తోంది. అస‌లు స్మార్ట్‌ఫోన్ లేనిదే చాలా మంది బ‌య‌ట కాలు కూడా పెట్ట‌రు. అయితే అరచేత్తో సూర్యుడిని ఆపలేమేమో గాని... అరచేతుల్లో పట్టే మొబైల్ ఫోన్ తో చాలా విషయాలు తెలుసుకోవ‌చ్చు. అందుకే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా మొబైల్ ఫోన్ లోనే వెతుకుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇంట‌ర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇక మొబైల్ ఫోన్‌, ఇంట‌ర్నెట్ వినియోగం ఎంత పెరిగిందో.. ఆన్ లైన్‌లో మోసాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోయాయి.

 

ముఖ్యంగా మేం బ్యాంకు వాళ్లమంటూ అకౌంటు నెంబరు, పేరుతో సహాచెప్పడంతో నమ్ముతున్న ఖాతాదారులు వారి మోసాల బారినపడిపోతున్నారు. అందుకే మీరు సంబంధించిన ఈ విష‌యాల‌ను ఎప్ప‌టికీ ఎవ్వ‌రికీ చెప్ప‌కూడ‌దు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా ఏటీఎంలో డబ్బు తీసుకోవాలన్నా లేదా పీఓఎస్ మెషీన్లలో లావాదేవీని పూర్తి చేయాలన్నా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పిన్ చాలా ముఖ్యం. మీరు పిన్ ఎంటర్ చేసేటప్పుడు ఎవ్వరు ఆ నెంబర్‌ను చూడకుండా జగ్రత్త పడండి. బ్యాంకులు కూడా మీ పిన్ ఏంటని అడగవు. ఒక‌వేళ వీటి గురించి ఎవ‌రైనా అడిగినా అస్స‌లు చెప్ప‌కండి. అలాగే బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై కార్డ్ వెరిఫికేషన్ వ్యాల్యూ నెంబర్ ఉంటుంది.

 

కార్డు వెనుక భాగంలో ఇది ప్రింట్ అవుతుంది. డిజిటల్ ట్రాన్సాక్సన్లలో ఈ నెంబర్ చిట్టచివరి సెక్యూరిటీ స్థాయిగా వ్యవహరిస్తుంది. అందుకే ఈ నెంబర్ ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడండి. అదేవిధంగా, వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. సాధార‌ణంగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. కార్డు, నెట్ బ్యాంకింగ్, ఇవాలెట్ ద్వారా జరిపే లావాదేవీలకు ఓటీపీ తప్పనిసరి. అందువల్ల మీ ఓటీపీని ఇతరులకు అస్స‌లు షేర్ చేయ‌కూడ‌దు మ‌రియు తెలియ‌నివ్వకూడ‌దు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఓటీపీ షేర్ చేయాలని కూడా కోరవు. కాబ‌ట్టి, ఎవ‌రైనా బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు నుంచి కాల్ చేస్తున్నామ‌ని చెప్పి ఓటీపీ అడిగినా చెప్ప‌కండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: