కరోనా ఎఫెక్ట్... వాట్సాప్ వినియోగదారులకు భారీ షాక్...!
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులసంఖ్య వెయ్యికు చేరువ కావడం ప్రజలను తీవ్ర భయాందోళన నెలకొంది. తెలంగాణలో ఇప్పటివరకూ 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 19 కేసులు నమోదయ్యాయి. ఈరోజూ ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఏపీ ఆరోగ్య శాఖ ఇప్పటికే హెల్త్ బులెటిన్ విడుదల చేయగా తెలంగాణ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేయాల్సి ఉంది.
కరోనా దెబ్బకు వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ద్వారా ఫేక్ వార్తలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉండటంతో వాట్సాప్ యాజమన్యం వాట్సాప్ స్టేటస్ నిఢివిని గతంతో పోలిస్తే తగ్గించింది. గతంలో వాట్సాప్ నిడివి 30 సెకండ్లుగా ఉండగా వాట్సాప్ 15 సెకండ్లకు నిఢివిని తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల ఫేక్ న్యూస్ కొంత వరకైనా అరికట్టవచ్చని వాట్సాప్ యాజమాన్యం భావిస్తోంది. వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్ల నుంచి హర్షం వ్యక్తం చేసింది.
కొందరు మాత్రం వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకూ 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కేసుల్లో ఒకరు మృతి చెందగా 13 మందికి నెగిటివ్ అని తేలింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా భారీన పడి 31,000 మంది మృతి చెందారు. చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన ఈ వైరస్ ఇప్పటివరకు 183 దేశాలకు వ్యాపించింది.
ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 6,67,090 మంది కరోనా భారీన పడ్డారు. వీరిలో 1,34,700 మంది కోలుకున్నారు. తెలంగాణలో కేసుల సంఖ్య రోజూ పెరుగుతూ ఉండటంతో కొత్తగా మూడు ప్రైవేట్ ల్యాబ్ లలో టెస్టులు చేయడానికి అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో ఎనిమిది ప్రైవేట్ ల్యాబ్ లలో పరీక్షలను నిర్వహించనున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple