టెక్నాల‌జీ: అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?

Kavya Nekkanti

చాలా రోజుల నిరీక్షణ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. శామ్సంగ్ కంపెనీ విడుదల చేసే ప్రతి మోడల్ ప్రపంచం మొత్తం మీద గొప్ప ఆదరణను పొందుతున్నాయి. 2020 సంవత్సరంలో మొదటి సారిగా శామ్సంగ్.. తన కొత్త శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మంగళవారం కొత్త ఫీచర్లతో గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. 

 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10కు టోన్ డౌన్ వెర్షన్ గా దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఎస్ పెన్ సపోర్టు, 4,500ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. 6జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్ రూ. 38,999, 8జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 40,999 ఉంటుంది. శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 10 లైట్‌ ఫీచర్లు చూస్తే.. 6.7 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే,  ఆక్టాకోర్‌ శాంసంగ్‌ ఎగ్జినోస్‌ 9810 ప్రాసెసర్‌, 6/8 జీబీ ర్యామ్, 12, 12, 12 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 32 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉన్నాయి.

 

వీటితో పాటు 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10, డ్యుయల్‌ సిమ్‌, ఎన్‌ఎఫ్‌సీ, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌, డాల్బీ అట్మోస్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0 అమ‌ర్చ‌బ‌డ్డాయి. అలాగే ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో అందించారు. ఇన్ బిల్ట్ ఎస్ పెన్ స్టైలస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. మ‌రియు మల్టీమీడియా కంట్రోల్, ఫొటోలు క్లిక్ చేయడం, ఎయిర్ కమాండ్స్ వంటి సాధారణ ఫీచర్లను ఇది అందిస్తుంది. దీని బరువు 199 గ్రాములుగా ఉంది. అలాగే గెలాక్సీ నోట్‌ 10 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆరా గ్లో, ఆరా బ్లాక్‌, ఆరా రెడ్‌ కలర్‌ ఆప్షన్లలో లాంచ్‌ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: