మానవాళితో జతకట్టనున్న సరికొత్త జీవులు.అంతరిక్షం నుండి వస్తున్న సంకేతాలు..

frame మానవాళితో జతకట్టనున్న సరికొత్త జీవులు.అంతరిక్షం నుండి వస్తున్న సంకేతాలు..

ఈ విశ్వం అనంతమైన రహస్యం,ఎన్నో అద్భుతాలను తనలో ఇముడుచుకుని మానవుని పరిజ్ణానానికి ఎప్పుడు పరీక్షలు పెడుతూనే వుంటుంది.ఇక మానవ మెదడును ఎప్పటినుండో వేదిస్తున్న ప్రశ్న గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎలా ఉన్నారు? మనలాగే ఉన్నారా?లేక స్టార్ వార్స్ సినిమాలోలా వింత వింత ఆకారాల్లో ఉన్నారా? వంటి ప్రశ్నలు శతాబ్దాలుగా మనకు సవాల్ విసురుతూనే ఉన్నాయి.త్వరలో వాటికి సమాధానం దొరికేలా ఉంది.అందుకు ఉదాహరణగా విశ్వంలో సుదూర ప్రాంతం నుండి వస్తున్న తరంగాలు శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యంలో పడేస్తున్నాయి,ఈ వింతైన అంతరిక్ష జీవులను ఎక్కువగా హాలీవుడ్,బాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం.‘అవెంజర్స్’ సినిమాల్లో అయితే మానవులకు,అంతరిక్ష జీవులకు మధ్య భీకరమైన యుద్ధాన్నే చూశాం.ఇక అప్పుడప్పుడు అవి కేవలం సినిమాల్లోనే కనిపిస్తాయి తప్ప నిజంగా చూడలేమా అనే అనుమానాలు వ్యక్తమవుతాయి.సోషల్ మీడియాలో కూడా కొన్నిసార్లు వాళ్ళ ఉనికి ఉందని ప్రచారం జరిగింది.



వాటిని నిజం చేస్తూ తాజాగా అంతరిక్ష జీవులు ఉన్నారంటూ శాస్త్రవేత్తలకు కొన్ని సంకేతాలు అందాయి.ఇప్పుడు అది నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఫాస్ట్ రేడియా బర్మ్స్((FRB))ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి.ఎందుకంటే ఫ్యూచర్‌లో దీని గురించి విపరీతమైన చర్చ జరగబోతోంది. ప్రపంచ రోదశీ పరిశోధకులంతా దీని గురించి మాట్లాడే రోజులు రాబోతున్నాయి. అందుకు బలమైన కారణాలున్నాయి.2001 జులై 24న తొలిసారిగా భూమివైపు ఇలాంటి తరంగం ఒకటి వచ్చిందని,సెకండ్ కంటే తక్కువ సమయంలో వచ్చిన ఆ తరంగం దానంతట అది రాలేదనీ,ఎవరో అత్యంత భారీ పేలుడు సృష్టిస్తే అందులోంచీ పుట్టిన ఓ తరంగం భూమివైపు వచ్చిందని ఖగోళ శాస్త్రవేత్త డంకన్ లోరిమెర్ అభిప్రాయపడ్డారు.



మరోవైపు 2007 వ సంవత్సరంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అప్పుడు విశ్వం నుంచి దాదాపు ఎనిమిది రకాల వేర్వేరు సంకేతాలు నమోదయ్యాయి.కాగా ఆ సంకేతాల వెనక రహస్యం ఏంటన్నది డీకోడ్ చేయలేకపోయారు. అప్పట్లో ఆ తరంగాలు ఎలా పుట్టాయో,ఎక్కడి నుంచి వచ్చాయో నాసా శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాలేదు.కానీ దానిపై ఓ కన్నేసి ఉంచారు. తాజాగా దాని నుంచి భూమిపైకి ఎనిమిది సంకేతాలు అందాయని పరిశోధకులు తేల్చారు.కెనడాలోని హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ టెలిస్కోప్ ఈ సంకేతాలను గ్రహించిందట.ఇక ఈ సంకేతాలను ఓ అంతుచిక్కని గ్రహాంతరజీవి పంపి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మనం ఎలా గ్రహంతర వాసులకోసం ప్రయత్నిస్తున్నామో,అవికూడా అలాగే ప్రయత్నించి సంకేతాలు పంపించి ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు..కాగా ఆ సంకేతాలు వేరే గెలాక్సీ నుంచి వచ్చాయా..లేక బ్లాక్ హోల్ నుంచి వచ్చాయనేదానిపై పరిశోధనచేసివాటిని డీకోడ్ చేసే పనిలో పడ్డారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: