“SBI ” ఖాతాదారులకి కళ్ళు చెదిరే దసరా ఆఫర్స్..

NCR

పండులు వచ్చాయంటే చాలు గుండు సూది నుంచీ యాపిల్ ఫోన్ వరకూ అన్నిటిలో భారీ భారీ ఆఫర్స్ ప్రకటిస్తూ వివిధ ఈ కామర్స్ దిగ్గజాలు భారీ భారీ ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి..అయితే ఎవరు ఎన్ని ఆఫర్స్ ప్రకటించినా సరే అందరూ ఆన్లైన్ బ్యాకింగ్ ద్వారా వివిధ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ చెల్లింపుల్లో కూడా బ్యాంక్ లు భారీ డిస్కౌంట్ ప్రకటిస్తాయి..

 

ఈ క్రమంలోనే దసరా పండుగ సందర్భంగా వివిధ బ్యాంకింగ్ సంస్థలు భారీ ఆఫర్స్ ప్రకటించాయి..అందులో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కూడా తన ఖాతా దారులకి భారీ డిస్కౌంట్ ప్రకటించింది..అదేంటంటే..ఈ పండుగల సీజన్‌లో డిజిటల్‌ వేదిక 'Yono ' యాప్‌ ద్వారా కొనుగోళ్లు జరిపే వినియోగదారులకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అదనపు రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.

 

ప్రస్తుతం 30 లక్షల మంది కస్టమర్లు గల Yono యాప్ లో ప్రతి రోజూ 25 వేల మంది వినియోగదారులు చేరుతున్నారని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు..ఈ యాప్‌తో 85 ఈ -కామర్స్‌ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి...క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా అక్టోబర్‌ 16-21 వరకు కొనుగోళ్లు జరిగే వినియోగదారులకు సంస్థ 10 శాతం వరకు రాయితీ, క్యాష్‌బ్యాక్‌ అందిస్తామని తెలిపింది...Yono ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, బహుమతులు, నగలు, ఫర్నీచర్‌, ట్రావెల్‌, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఆఫర్లు లభిస్తాయి.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: