టీవీ: బిగ్ బాస్ సోనియా పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
అయితే హౌస్ నుంచి బయటికి వచ్చాక సోనియా పేరు తెగ వైరల్ గా మారింది.. పలు రకాల ఇంటర్వ్యూలలో ఈమె పలు విషయాలను తెలియజేసింది. ఇదంతా పక్కన పెడితే సోనియా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. తన ప్రియుడు యష్ పాల్ వీరగోనీ ని వివాహం చేసుకోబోతోంది.. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో నవంబర్ 21న వీరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగినది తాజాగా పెళ్లి డేట్ ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం డిసెంబర్ 21 మధ్యాహ్నం 3:40 నిమిషాలకు వీరి వివాహం జరగబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని సైతం విడుదల చేసింది సోనియా.
దీంతో అభిమానులు ముందుగానే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోనియా తనకు కాబోయే శ్రీవారిని సైతం బిగ్ బాస్ హోస్ట్ అయిన నాగార్జునను కలిసి తమ పెళ్ళికి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.. నాగార్జున కూడా వీరి పెళ్లికి వస్తానంటూ మాట ఇచ్చారట.. అందుకు సంబంధించిన వీడియో ని కూడా సోనియా కాబోయే భర్త యష్ తన ఇంస్టాగ్రామ్ వీడియోలో తెలియజేశారు.. మా జీవితంలో ఏదైనా స్పెషల్ డే అయినటువంటి మా వివాహానికి తప్పకుండా రావాలని నాగార్జున గారిని ఆహ్వానించామంటూ ఈ వీడియోలో తెలిపారు..