టీవీ: జబర్దస్త్ ఫేమ్.. పొట్టి నరేష్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్..!

Divya
జబర్దస్త్ లో తన పంచ్ డైలాగులతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ లో పొట్టి నరేష్ కూడ ఒకరు. ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ టీమ్ లో కనిపిస్తూ ఉంటారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే నరేష్ ఒక చిట్ చాట్ లో భాగంగా తన పెళ్లి విషయం పైన మాట్లాడడం జరిగింది.. అందరూ తనను ఎంఐలు కట్టడం కోసమే తాను ఏ అమ్మాయిని వివాహం చేసుకోలేదు అనుకుంటూ ఉంటారు.. కానీ చెప్పాలి అంటే ముందుగా తనని ఎవరు చూడడం లేదని నన్ను అందరూ ఎత్తుకుంటున్నారని తెలియజేశారు పొట్టి నరేష్. తను పొట్టిగా ఉండడం వల్లే చాలామంది వెనక్కి వెళ్లారని తెలిపారు నరేష్..

అమ్మాయిలతో మాట్లాడడం అంటే తనకు సిగ్గు అని ఒకవేళ తాను పెళ్లి చూపులకు వెళ్లిన సరే ముఖ్యంగా తనతో పాటు బుల్లెట్ భాస్కర్ ని తీసుకువెళ్లను.. ఎందుకంటే ఇలాంటోడికి పిల్లని ఇస్తారా అని మరి చెడగొడతారనీ తెలిపారు.. తన కెరియర్ల ఎప్పటికైనా సరే జబర్దస్త్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని.. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫైనాన్షియల్ గా చాలా బలాన్ని కూడా ఇచ్చిందని తెలిపారు నరేష్. టీవీ షోస్ తో పలు రకాల ఈవెంట్స్ తో బిజీగా ఉండడం వల్ల తన సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదని తనకు కూడా నటన అంటే పెద్దగా ఇష్టం లేదని తెలిపారు నరేష్.

తనకు ఎక్కువగా డాన్స్ చేయడం అంటే ఇష్టం అని డాన్సర్ కావడానికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను..మొదట ఢీ జూనియర్స్ లో చేద్దామనుకున్నాను కానీ తనని మాత్రం వాళ్లు గ్రూప్ డాన్సర్ లో పెట్టేసారని తెలియజేశారు.ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ తనకు యాక్టింగ్ నేర్పిస్తారని చెప్పిన ఆ సమయంలో తనకు అది ఇష్టం లేదని చెప్పాను.. చివరికి డాన్సర్ అవుదామని ఇండస్ట్రీ లోకి వచ్చి ఆర్టిస్టుగా మిగిలిపోయారు అంటూ తెలిపారు నరేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: