టీవీ:KCR కోసం అన్ని అమ్మేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. చివరికి ఏంజరిగిందంటే..?

Divya
దాదాపుగా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా సినీ ఇండస్ట్రీలో బాగానే పేరు సంపాదిస్తున్నారు. జబర్దస్త్ ను బీట్ చేయడానికి ఎన్నో షోలు వచ్చినప్పటికీ ఈ షోని బీట్ చేయలేకపోయారు. టాలెంట్ ఉండి దానిని ఎలా నిరూపించుకోవాలో అనుకునే వారికి జబర్దస్త్ ఒక ప్లాట్ఫారం గా మారిపోయినది. అలా ధనరాజ్, షకలక శంకర్, సుధీర్ హైపర్ ఆది, గెటప్ శ్రీను, రోహిణి, రీతు చౌదరి తదితర సెలబ్రెటీలు సైతం ఇండస్ట్రీలో బాగానే పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు వీరు దిష్టిలోకి రాకింగ్ రాకేష్ కూడా చేరారు.

జబర్దస్త్ టీమ్ మెంబెర్ గా పనిచేసిన రాకింగ్ రాకేష్ చిన్నపిల్లలతో చేసేటువంటి స్కిట్స్ అందరిని ప్రశంశాలు అందుకున్నాయి. ఈ క్రమంలోనే జోర్దార్ సుజాతతో జబర్దస్త్ వేదికగా పరిచయం కావడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఒక ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. తాజాగా రాకింగ్ రాకేష్ హీరోగా కేసీఆర్ అనే సినిమాలో నటించారు. అంతేకాకుండా స్వయంగా నిర్మాతగా కూడా రాకేష్ ఈ సినిమాకి వ్యవహరించడం జరిగింది. తెలంగాణలోని ఒక తాండ బ్యాక్  డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాకేష్ మాట్లాడుతూ సినిమా కోసం నిర్ణయం తీసుకోగానే చాలామంది మేము అండగా ఉంటామని చెప్పి మధ్యలోనే హ్యాండ్ ఇచ్చారని ఒక పొలిటికల్ పార్టీ వల్ల లబ్ధి పొందినట్లుగా తమ పైన చాలా ఆరోపణలు వచ్చాయని కానీ అలాంటిదేమీ లేదని తెలిపారు సినిమా తీయాలి అంటే డబ్బే అవసరం లేదని కూడా తెలిపారు.. ఈ సినిమా కోసం తన తల్లికి ఇష్టమైన ఇల్లుని తాకట్టు పెట్టి మరి సినిమా చేశామని.. అలాగే తన భార్య సుజాత కూడా తన కారుని అమ్మేసి మరీ తనను ప్రోత్సహించిందనీ.. అలాగే తన పొలము స్థలము అన్నిటినీ కూడా తాకట్టు పెట్టి మరి కెసిఆర్ సినిమాని తీశారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: