టీవీ: ఛాన్సులు రావాలంటే.. కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..!

Divya
సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్గా ఉండేటువంటి యాక్టర్లలో బిగ్ బాస్ బ్యూటీ హిమజ కూడా ఒకరు.. ఎన్నో చిత్రాలలో అవకాశాలు సంపాదించుకున్న ఈమె సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి పదేళ్లకు పైగా కావస్తోంది. మొదట పలు రకాల సీరియల్స్ లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హిమజ 2013లో శివమ్ సినిమాలో నటించింది. ఆ తర్వాత నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, స్పైడర్, ఆవిరి, దేవర తదితర చిత్రాలలో కూడా నటించింది. అవకాశాలు వస్తూ ఉన్న తనకు నచ్చిన పాత్రలోనే చేస్తుంది హిమజ.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజ తనకి ఒక ప్రశ్న ఎదురవ్వగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు తక్కువగా వస్తున్నాయి అందుకు కారణం ఏంటి అని ప్రశ్నించగా.. హిమజ ఇలా మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలు ఒకప్పుడు చాలా రిజర్వుడ్ గా ఉండేవారు కానీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయనుకోవడం చాలా తప్పు.. కమిట్మెంట్ ఇచ్చిన వారందరికీ కూడా అవకాశాలు రాలేదని.. అలా అవకాశాలు అందుకున్న వారందరూ కూడా కమిట్మెంట్ ఇచ్చిన వారు కాదు అంటూ తెలిపింది..

కేవలం ముంబై నుంచి వచ్చిన వాళ్లకు మాత్రమే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు.. మరి వారికి వాళ్లలో ఏం నచ్చిందో తెలియదు కానీ ఒకసారి కూడా తెలుగు అమ్మాయిలను హీరోయిన్గా చేస్తామని ఎవరూ కూడా చెప్పరు.. మొదట అవకాశం వస్తే వాటిని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపింది హిమజ.. తాను కూడా మొదట హీరోయిన్ మాత్రమే కావాలని రాలేదు. కానీ వచ్చిన అవకాశాన్నల్లా ఉపయోగించుకొని చేస్తూ ఉన్నాను అందుకే ప్రస్తుతం ఈ పొజిషన్లో చాలా హ్యాపీగా ఉండాలని తెలిపింది. వాస్తవానికి హిమజ హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ కూడా హీరోయిన్గా అవకాశాలు రాలేదు కానీ పలు రకాల క్యారెక్టర్లలో నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: