టీవీ: బిగ్ బాస్ ఓటింగ్లో విష్ణుప్రియకు షాక్.. ఎలిమినెట్ ఎవరంటే..?

Divya
తెలుగు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే ఆరో వారం ఎండింగ్ స్టేజి కూడా వచ్చేసింది. కొత్తగా వైల్డ్ కార్డు ద్వారా చాలామంది కంటెస్టెంట్స్ పాతవారు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హౌస్ లో అయితే 16 మంది ఉన్నారు. వీకెండ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఒకరు ఎలిమెంట్ అవ్వాల్సిందే.. అయితే ఈ వారం హౌస్ నుండి ఎవరు బయటికి వెళ్తారనే విషయం పైన చాలామంది ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలాగే ఆరో వారంలో మొత్తం 6 మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లిస్టులోకి వచ్చేశారు.

అందులో మొదట కిరాక్ సీత, మరొకరు విష్ణు ప్రియ, మరొకరు పృద్వి, మరొకరు యష్మి గౌడ, గంగవ్వ, మెహబూబ్ వంటి వారు నామినేషన్ జాబితాలో ఉన్నారు. అయితే మంగళవారం అర్ధరాత్రి నుంచి ఓటింగ్ మొదలైతే శుక్రవారం అర్ధరాత్రితో వీరు ఓటింగ్ క్లోజ్ అవుతుంది. అయితే బిగ్బాస్ తెలుగు సీజన్ 6 వారం ఓటింగ్లో మొదటి నుంచే గంగవ్వ టాప్ ప్లేస్ లో ఉన్నది. కానీ ఆ తర్వాత స్థానం విష్ణు ప్రియ అనుభవంగా ఓట్లు తగ్గిపోయాయి. ఈ సీజన్ మొదటి నుంచి రెండు మూడు వారాల వరకు టాప్ ప్లేస్ లో ఉన్న విష్ణు ప్రియ ఇప్పుడు ఏకంగా నాలుగవ స్థానంలో ప్లేస్ సంపాదించుకుంది. విష్ణు ప్రియ ఆట చేష్టలకు అభిమానులు విసిగిపోయారని అందుకే ఓట్లు వేయలేదని సమాచారం.

గంగవ్వ తర్వాత రెండవ స్థానంలో మెహబూబ్ ఉన్నారు.. డేంజర్ జోన్ లో ఉన్నటువంటి యష్మీ ఇప్పుడు మూడవ స్థానానికి వచ్చింది. విష్ణు ప్రియ నాలుగవ స్థానంలో, పృద్వి 5వ స్థానం, చివరిగా ఆఖరి స్థానం కిరాక్ సీత ఉన్నారు.. ఈ లెక్కన చూసుకుంటే ఆరో వారంలో కిరాక్ సీత, పృద్వి డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పవచ్చు. అయితే పృద్వి ఎక్కువగా లవ్ ట్రాకులు..కంటెంట్ నడుపుతూ ఉండడం చేత ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు కనుక కిరాక్ సీతనే బయటికి వెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: