టీవీ: దేవరలో నటించిన ఈ బుల్లితెర నటి ఏజ్ ఎంతో తెలుసా..?

Divya
ఇటీవలే విడుదలైన దేవర చిత్రంలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న నటి శృతి మరాఠీ. దేవర సినిమా షూటింగ్ సమయంలో ఈమె పేరు వినిపించిన ఆ తర్వాత రిలీజ్ కి రెండు రోజులు ముందు నుంచి ఈమె పేరు బాగా వైరల్ గా మారింది. దేవర చిత్రం రెండు భాగాలుగా డైరెక్టర్ కొరటాల శివ ప్లాన్ చేశారు. ఇందులో దేవర, వర అనే రెండు పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో ప్రశంశాలు అందుకున్నారు.

ఎన్టీఆర్ దేవర పాత్రకు జోడిగా శృతి మరాఠీ నటించినది.ఇమే బుల్లితెర పైన కూడా మరాఠీలలో పలు సీరియల్స్ లో కూడా నటించింది. 2003లో పెస్వాయి అనే మరాఠి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఆట పలు సీరియల్స్ లో నటించి, సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంది ఎక్కువగా ఈమె తమిళ్ మరాఠీ వంటి చిత్రాలలో, హిందీ మరాఠీ సీరియల్స్ లోనే నటించింది. ప్రస్తుతం ఇప్పుడు ఈమె గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ఈమె వయసు ఎంత అనే విషయానికి వస్తే.. ఈమె వయసు 37 సంవత్సరాలు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కి ప్రస్తుతం 41 సంవత్సరాలు అంటే వీరి మధ్య కేవలం నాలుగేళ్లు మాత్రమే గ్యాప్ ఉందని చెప్పవచ్చు.

అయితే కేవలం ఇంత తక్కువ ఏజ్ లోనే తల్లి పాత్రలో నటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. శృతి మరాఠీ పాత్ర మరింత ఉంటే బాగుంటుండేది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తన నటనతో మెర్పించింది శృతి మరాఠీ. అయితే ఈమె రెమ్యూనరేషన్ విషయంలో కూడా కాస్త ఎక్కువగానే పుచ్చుకున్నట్లు సమాచారం. శృతి మరాఠీ ఇక తెలుగులో ఆఫర్లు వస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉన్నదట. మరి రాబోయే రోజుల్లో ఏ చిత్రాలలో నటిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: