టీవీ: బిగ్ బాస్ -8 లో ముగ్గురు హాట్ బ్యూటీస్.. ఆడియన్స్ తట్టుకోగలరా..?

Divya
బిగ్ బాస్ -8 నుంచి ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమెంట్ కావడం జరిగింది. అయితే మిగిలిన కంటెస్టెంట్స్ కూడా పెద్దగా ఆడియన్స్ ఆకట్టుకోలేకపోతున్నారు.. దీంతో పాటుగా గత సీజన్తో పోలిస్తే రేటింగ్ కూడా చాలా తగ్గిపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే బిగ్ బాస్ ఒక రకమైన నిర్ణయాన్ని తీసుకుంది.అదేమిటంటే ఎన్నడూ లేనివిధంగా ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఏకంగా 12 మందిని హౌస్ లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే హౌస్ లో ఉన్న వారందరికీ కూడా టాస్కులు ఉంటాయని తెలిపారు.

లోపల ఉన్న కంటెస్టెంట్స్ టాస్కులు పెడతామని ఆ టాస్కులు ఎన్ని విన్ అయితే అంతమంది హౌస్ లోకి రాకుండా చూడవచ్చట. గతంలో హౌస్ లో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్స్ ఈసారి కూడా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అందులో బిగ్ బాస్ సీజన్ మొదటి భాగంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న హరితేజ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోందట. ఈమె సినిమాలలో కూడా ఇటీవల కాలంలో ఎక్కువగానే నటించింది. సోషల్ మీడియాలో కూడా హాట్ గ్లామర్ తో ఆకట్టుకుంటోంది.

అలాగే బిగ్ బాస్ సీజన్ -2 లో ఎంట్రీ ఇచ్చిన దీప్తి సునైనా కూడా ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఈమె కూడా సోషల్ మీడియాలోనే భారీ క్రేజ్ అందుకున్నది.. మరొక కంటెస్టెంట్ హాట్ బ్యూటీగా సోషల్ మీడియాలో పేరు పొందిన ఇనయా సుల్తానా కూడా బిగ్ బాస్ -8 లో పాల్గొనబోతోందట. గతంలో ఇమే బిగ్ బాస్ -6 లో పాల్గొనింది. మరి వీరందరూ కూడా గతంలో బిగ్ బాస్ కంటే ఈ మధ్యకాలంలో భారీ క్రేజ్ అందుకోవడమే కాకుండా చాలా హాట్ లుక్స్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ వైట్ కార్డు ద్వారా బిగ్ బాస్ -8 లో ఎంట్రీ ఇస్తే ఇంతటి అందగత్తెలను ఆడియాన్స్  తట్టుకోగలరా అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరందరూ ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: