టీవీ: నన్ను కూడా అలా హింసించారు.. నటి హిమజ ఎమోషనల్ కామెంట్స్..!

Divya
గతంలో బుల్లితెర పైన సందడి చేసిన సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు దీటుగా అవకాశాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో హిమజ కూడా ఒకరు. మొదట సినిమాల మీద ఇష్టంతో హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హిమజ.. బుల్లితెర పైన మొదటిసారి తన కెరీర్ని ప్రారంభించింది. అలా స్వయంవరం అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత క్రేజ్ ను అందుకున్నది హిమజ.
హిమజ బుల్లితెర పైన కాకుండా వెండితెర పైన కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. సహ నటీగా మంచి పేరు సంపాదించుకున్న హిమజ వరుసగా అవకాశాలు రావడంతో బిగ్ బాస్ రియాల్టీ షో-3 లో  పాల్గొని తనదైన మార్కుతో అందరినీ ఆకట్టుకుంది. హౌస్ లో నుంచి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హిమజ హీరోయిన్గా కూడా నటించిన సక్సెస్ కాలేక పోయింది. కొన్ని చిత్రాలలో సైకో పాత్రలలో కూడా నటించింది హిమాజ. అలా ఎన్నో ప్రయోగాత్మకమైన చిత్రాలలో నటించి దూసుకుపోయింది.

ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో తనదైన మార్కు సంపాదించుకున్న హిమజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ గురించి తాను వెన్న సందర్భాలలో ఏడ్చానని అందరిలాగే తాను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానన. ఒకానొక సమయంలో ఇలాంటివి భరించడం తన వల్ల కాదనుకున్నారని తెలిపింది. మనం చేసే పని కరెక్ట్ గా ఉందా లేదా అన్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా తెలిపింది. హిమజ కెరియర్లలో తన పైన బాడీ షేవింగ్ కామెంట్స్ వచ్చాయని ముఖ్యంగా తన కళ్ళు బాగోవని చాలామంది డైరెక్టర్లు ముఖం మీదే చెప్పేయడం వల్ల చాలా బాధపడ్డాను.. కానీ చివరికి మేకప్ తీసుకొని వచ్చిన తర్వాత చివరికి వాళ్లే తన కళ్ళే బాగా నచ్చాయని చెప్పేవారని.. అలాగే చాలామంది తనను ఒక మగాడిలా నడుస్తానని అంటూ ఉంటారు అంటూ తెలిపింది హిమాజ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: