టీవీ: నూకరాజు- ఆసియా లవర్స్ కాదా.. అన్నా చెల్లెలు అంటూ ట్విస్ట్..!

Divya
తెలుగు బుల్లితెర పైన పటాస్ షో జంటగా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో పటాష్ నూకరాజు- ఆసియా కూడా ఒకరు.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత ఈ జంట మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి పలు రకాల యూట్యూబ్ చానల్స్ లో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. దీంతో పాటుగా వీరిద్దరి మధ్య లవ్ ఉందనే విషయాన్ని కూడా ఎన్నో సందర్భాలలో చూపించినప్పటికీ ఈ విషయం పైన ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. ఆసియా మాత్రం జబర్దస్త్ షోలోకి లేడీ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది.

మొదటినుంచి నూకరాజుతో మంచి పరిచయం ఉండడం చేత ఆ పరిచయం కాస్త స్నేహంగా ప్రేమగా మారినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆ మధ్య వీరిద్దరూ కూడా గొడవలు పడి బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఒక ప్రైవేట్ సాంగ్ తో అభిమానులకు ఒక సడెన్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొన్న వచ్చిన నా గుండె గోదారి లవ్ ఫెయిల్యూర్ పాట భారీగానే వ్యూస్ రాబట్టింది. దీంతో వీరిద్దరూ లవర్స్ అని అందరూ కూడా కన్ఫామ్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఆసియాతో నా చెల్లెమ్మ అంటూ ఒక పాటను చేయడం అందరికి షాక్ గురిచేసింది.
నూకరాజు తో ఆసియా చెల్లెలి పాత్రలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పాట పైనా అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ పాట పైన అటు నూకరాజు కానీ ఆసియా కానీ ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు. మరి ఎవరో ఒకరు రెస్పాన్స్ అయి ఈ విషయం పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి ఈ పాట రాఖి పండుగ ఫెస్టివల్ కి స్పెషల్ వీడియో అవుతుందేమే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: