టీవీ: బిగ్ బాస్ -8 మొదలుకాకుండానే.. విన్నర్ చెప్పేస్తున్న స్టార్ హీరో ఫ్యాన్స్.. ఎవరంటే..?

Divya
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో -8 కోసం చాలా మంది ఎక్సైటింగ్ ఇంకా అభిమానులు ఎదురుచూస్తున్నారు.. ఈ షోని చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో.. అలాగే విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ - 8  షో గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరొక విషయం వైరల్ గా మారుతున్నది. ఎన్నికలకు ముందు కుమారి ఆంటీ అనే పేరుతో ఒక మహిళ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా తెలంగాణలో ఏపీలో ఈమె పేరు బాగా వినిపించడం కూడా జరిగింది. చాలామంది సెలబ్రిటీలు కూడా ఇమే దగ్గరకు వెళ్లి మరి ప్రమోషన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

దీంతో ఈమెను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టీవీ షోస్ వరకు కూడా వెళ్ళింది కుమారి ఆంటీ.ఈమధ్య ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా పలు రకాల ఇంటర్వ్యూలను ఇస్తోంది. రోడ్డు సైడ్ కేవలం చిన్న వ్యాపారం పెట్టుకొని సక్సెస్ అయిన కుమారి ఆంటీ బిగ్ బాస్ లోకి తీసుకురావాలని అ షో నిర్వాహకులు చాలా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వార్త బిగ్ బాస్ ప్రేక్షకులకు తెలియడంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ పవన్ కళ్యాణ్ ఫోటోతో ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని.. మీ వెనుక పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం ఉంటారు అన్నట్లుగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మిమ్మల్ని టైటిల్ విన్నర్ చేసేలా కూడా చేస్తామంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో కొంత మంది విమర్శిస్తున్న మరి కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు.. మొత్తానికి కుమారి ఆంటీ ఈసారి టైటిల్ విన్నర్ అట్టు చెప్పకనే చాలామంది తెలియజేస్తున్నారు. మరి ముందుగా అసలు ఈమెకు బిగ్ బాస్-8 లోకి అవకాశం వస్తుందా రాదా అనే విషయం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: