టీవీ: జబర్దస్త్ లేడీ కమెడియన్ ని హేమ అమ్మేయాలనుకుందా..?

Divya
నటి హేమ రేవ్ పార్టీ లో పేరు వచ్చినప్పటి నుంచి ఈమెకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బ్లడ్ శాంపుల్ చేసినప్పుడు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆనవాలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మా మెంబర్ గా ఉన్న హేమను త్వరలోనే తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కరాటే కళ్యాణి తెలియజేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరొక బాంబు పేల్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాటి గురించి చూద్దాం.

మా వాట్సాప్ గ్రూపులో ఒకసారి జబర్దస్త్ కమెడియన్ వర్ష ఫోటోను హేమ షేర్ చేసిందని అసలు ఆ ఫోటో ఎందుకు గ్రూపులో పోస్ట్ చేసిందని అందరూ చర్చించుకున్నారని తెలిపింది..అయితే అలా షేర్ చేసిన కొన్ని సెకన్లకి ఆ ఫోటోని డిలీట్ చేసిందని ఆ ఫోటో వేరే గ్రూపులో వేయవలసిన ఇమేజ్ను మరిచిపోయి తమ గ్రూపులో పెట్టినట్లు ఆ తర్వాత హేమ తెలియజేసిందట. అయితే ఆ ఫోటోను ఎందుకు షేర్ చేసింది..? ఆ ఫోటోతో తనకు ఎలాంటి సంబంధం ఉందనే విషయాలను వివరించాల్సి ఉంది అంటూ కరాటే కళ్యాణి ప్రశ్నిస్తోంది.

 హేమ బెంగళూరు రేవ్ పార్టీలో సంబంధం లేదని చాలా కవర్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా వంట వీడియోస్, ఫామ్ హౌస్ వీడియోలను కూడా షేర్ చేసి తప్పుదావా పట్టించింది.. కానీ చివరికి అలాంటి పప్పులేవి ఉడకలేదు పోలీసులు ఆమెను ఈ రేవ్ పార్టీలో సంబంధం ఉందంటూ నోటీసులు ఇచ్చారని కూడా తెలిపింది. అందుకే హేమ బయటకు రాకుండా ఇంట్లోనే కూర్చొని ఉందంటూ కరాటే కళ్యాణి తెలిపింది. అయితే ఈ విషయాల పైన పలువురు నెటిజెన్స్ రియాక్ట్ అవుతూ వర్ష నీ కూడా అమ్మేయాలని చూసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ వల్ల హేమ పరిస్థితి చాలా దీన పరిస్థితి అయిపోయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: