టివి: ఆమె కొట్టడం వల్లే ఇలా.. అనసూయ హాట్ కామెంట్స్..!!

Divya
టాలీవుడ్ లో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. యాంకర్ గా సక్సెస్ కావడమే కాకుండా వెండితెర పైన కూడా కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీ నటిగా పేరు సంపాదించింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది అనసూయ. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు సంపాదించింది.

కొన్నిసార్లు అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసేటువంటి పోస్టులు కూడా పెద్ద ఎత్తున వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో సైబర్ క్రైమ్ కూడా ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. తన గురించి ఎవరేమనుకున్న అనసూయ మాత్రం తను చేయాలనుకున్న పనిని చేస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అనసూయ తన చిన్నప్పటి ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. అనసూయ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ ఈ ఫోటోలలో ఒక పాప్ సాంగ్ పెట్టి చివరిలో హాట్ గా కనిపించేలా అనసూయ ఫోజులు ఇచ్చింది.

ఫోటోలతో వీడియో క్రియేట్ చేసి మరి సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోని షేర్ చేసి.." ఆమె కొట్టడం వల్లే నేను ఇలా టండోలా మారిపోయాను అంటూ అనసూయ క్యాప్షన్ని రాసుకు వచ్చింది". ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది. ఇది చూసిన పలువురు అభిమానులు నెటిజన్స్ సైతం అనసూయ చాలా క్యూట్ గా చిన్నప్పుడు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అదే అందం పెద్దయ్యాక కూడా వచ్చింది అంటూ పలువురు తెలియజేస్తున్నారు. చివరిగా అనసూయ రజాకర్ అనే సినిమాలో నటించింది. ఇందులో ఈమె పాత్ర బాగా పాపులారిటీ అయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: