టీవీ:హాట్ టాపిక్ గా మారుతున్న యాంకర్ శ్రీముఖి రెమ్యూనరేషన్..!!

Divya
తెలుగు బుల్లితెరపై అందాల ముద్దుగుమ్మగా పేరుపొందిన యాంకర్ శ్రీముఖి.. రాములమ్మగా కూడా పేరు సంపాదించుకుంది.. పటాస్ షో ద్వారా మొదట తన కెరీర్ ను ప్రారంభించిన శ్రీముఖి ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో యాంకరింగ్ స్కేల్ తో తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా పాపులారిటీ అందుకున్నది.. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన యాంకర్ గా పేరుపొందింది శ్రీముఖి గురించి ఎప్పుడూ కూడా ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. వరుస పెట్టి టీవీ షోలతో అలరించిన శ్రీముఖి రోజురోజుకీ తన క్రేజీ మాత్రం పెంచేసుకుంటోంది.

దీంతో టీవీ షోలకు ఆమె రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే పుచ్చుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఒక టీవీ షో కి శ్రీముఖి.. రూ.2 నుంచి 3 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీముఖి కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం, సూపర్ సింగర్ వంటి షోలకు పోస్టుగా వ్యవహరిస్తోంది.గతంలో కూడా ఎన్నో షోలకు శ్రీముఖి యాంకర్ గా చేసింది అవన్నీ కూడా విజయవంతంగానే నిలిచాయి..

గతంలో కూడా శ్రీముఖి హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. చివరికి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన కూడా అక్కడ భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రన్నర్ గా గెలవలేకపోయింది. అడపా దడపా సినిమాలలో నటిస్తున్నప్పటికీ శ్రీముఖి చివరిగా చిరంజీవి నటించినటువంటి భోళా శంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో చాలా దారుణంగా ట్రోల్ కి గురయ్యింది శ్రీముఖి.. ప్రస్తుతం శ్రీముఖి ఒకవైపు యాంకర్ గా మరొకవైపు పలు సినిమాలలో నటిస్తూ బిజీగా తన కెరీయర్ని గడిపేస్తోంది. అయితే పెళ్లి విషయాన్ని మాత్రం దాటేస్తూ ఉంటోంది  శ్రీముఖి.. అభిమానులు మాత్రం ఈమె పెళ్లి కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: