టీవీ: బిగ్ బాస్ ఆఫర్ పైన క్లారిటీ ఇచ్చేసిన బర్రె లక్క..!!

Divya
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల కటౌట్లు పార్టీల పోస్టర్లే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు సైతం సినీ సెలబ్రిటీలు కూడా పలు పార్టీలకు సైతం మద్దతుగా తెలియజేస్తూ ఉన్నారు. చాలాచోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలోకి దిగి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అలాంటి వారిలో బర్రె లక్క అలియాస్( శిరీష )కూడా ఒకరు. తెలంగాణలో ఎక్కువగా ఈమె పేరే వినిపిస్తోంది.. చాలామంది విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈమెకు మద్దతుగా నిలుస్తున్నారు.


సోషల్ మీడియాలో కూడా ఈమె పేరు బాగా వైరల్ గా మారుతోంది. ఇదంతా ఇలా ఉండగా శిరీష కు బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి ఒక అదిరిపోయే ఆఫర్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఒక ఖరీదైన కారును పంపించారని ప్రచారం జరుగుతున్నది. ఈ విషయం పైన శిరీష స్పందించడం జరిగింది.. ఈ విషయం పైన తనని బిగ్ బాస్ వారు ఇప్పటివరకు ఎక్కడ సంప్రదించలేదని బహుశా తన గురించి తెలియదేమో అంటుకుంటున్నట్లుగా తెలియజేసింది శిరీష.


బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ మెసేజ్లు అసలు రాలేదని తనకు ఖరీదైన కారు ఇచ్చారని వార్త పూర్తిగా అవాస్తవమని.. తనకు తెలిసిన వాళ్లు కొంతమంది ఇబ్బంది పడుతున్నారని తెలిసి ప్రచారానికి కార్లు వాడుకోమని సలహా ఇస్తున్నారట.అయితే అందులో ఒక కారు మాత్రం ఒక అన్న ఉచితంగా ఇచ్చారని స్పష్టం చేసింది. గతంలో ఒక్క వీడియోతో సోషల్ మీడియాతో తెగ వైరల్ గా మారింది శిరీష.. ఈమె నాగర్ కర్నూల్ జిల్లా పెద్దపల్లి మండలం కి చెందిన అమ్మాయి బీకాం వరకు చదువుకున్నది. ఒక చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తోంది శిరీష. ఇలా కానిస్టేబుల్ గ్రూప్-1 ఇతరత్రా సర్కారీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉండేది.. 2021 సెప్టెంబర్ లో శిరీష ఒక వీడియో ద్వారా పాపులర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: