టీవీ: యాక్టర్ ప్రగతి బిగ్ బాస్ ప్రియాంకాకి ఉన్న రిలేషన్ ఏమిటంటే..?

Divya
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా చాలామంది కంటిస్టెంట్స్ సైతం మంచి పాపులారిటీ అందుకుంటున్నారు. ఇలాంటి వారిలో ప్రియాంక జైన్ కూడా ఒకరు. ఎన్నో సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈసారి బిగ్ బాస్ సీజన్ -7 లో పాల్గొనడం జరిగింది. హౌస్ లో అందరితో కలిసిపోతూ అవసరమైనప్పుడు మాత్రమే తన వాయిస్ ను చాలా గట్టిగా వినిపిస్తూ బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. ఇలా హౌస్ లో కొనసాగుతూ స్ట్రాంగ్ కంటిన్యూస్టెంట్ గా ఉన్న ప్రియాంక జైన్ గడిచిన ఆదివారం క్రితము బిగ్ బాస్ వేదిక పైన తన తల్లితోపాటు నటి ప్రగతిని కూడా తీసుకురావడం జరిగింది.


అయితే ఇలా స్టేజ్ మీదకి సైతం తన తల్లి లాగానే నటి ప్రగతి కూడా రావడంతో ఒక్కసారిగా ఇమే ఎమోషనల్ కావడం జరిగింది. దీంతో చాలామంది సైతం పలు రకాల అనుమానాలు మొదలవుతున్నాయి. అసలు ప్రియాంకకు- ప్రగతికి మధ్య బంధం ఏమిటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రగతికి ప్రియాంక కి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటంటే అనే విషయంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడిందట.. అదేమిటంటే బిగ్బాస్ వేదిక మీదికి వచ్చిన వారిలో ఒకరు రియల్ మదర్ కాక మరొకరు రీల్ మదరట.


ప్రియాంక నటించిన మొదటి సినిమాలో ఆమెకు తల్లిగా ప్రగతి నటించింది..అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతూ వచ్చిందట. ఈ విషయం తెలిసినటువంటి బిగ్ బాస్ షో నిర్వాకులు ప్రగతిని ప్రత్యేకంగా ప్రియాంక కోసమే తీసుకురావడం జరిగిందట. అలా ఒక్కసారిగా ప్రగతిని బిగ్ బాస్ వేదిక పైన చూడడంతో ఆశ్చర్యపోయారు.. ప్రగతి కూడా ప్రియాంకతో మాట్లాడుతూ నువ్వు చాలా అద్భుతంగా ఆడుతున్నావని చెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అంటూ ఎలాంటి హద్దులు దాటకుండా చాలా ధైర్యంగా ఆడుతున్నావు అంటూ తెలియజేసింది ప్రగతి.. ఈ విషయం చెప్పగానే ప్రగతిని ఎమోషనల్ గా హత్తుకుంది ప్రియాంక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: