షోలో లవర్ తో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది.. చేసిన పని చూసి షాక్..!!

Divya
ఈ దశాబ్ద కాలంలో బుల్లితెరపై ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. సాదాసీదాగా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే హైపర్ ఆది ఈ మధ్యకాలంలో కాస్త ఎవరూ ఊహించని విధంగా మాట్లాడుతూ తన స్థాయిని తగ్గించుకుంటున్నారు. బుల్లితెరపై మాత్రం ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాకుండా పలు సినిమాలలో కూడా నటిస్తూ మంచి అవకాశాలను అందుకుంటున్నారు హైపర్ ఆది. ఇప్పుడు తాజాగా ఒక షోలో హైపర్ ఆదికి అమ్మాయి ముద్దు పెట్టడం జరిగింది.


మొదట జబర్దస్త్ షో ద్వారా కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టీం మెంబెర్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. అప్పటినుంచి తనదైన స్కిట్లను ప్రదర్శించి మరింత క్రేజీ అందుకున్నారు హైపర్ ఆది. యూట్యూబ్లో కూడా హైపర్ ఆది స్కిట్లు ఎన్నో రికార్డులను సైతం అందుకున్నాయి. జబర్దస్త్ కమెడియన్గా మంచి క్రేజ్ అందుకున్న హైపర్ ఆది సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీ అందుకున్నారు. అంతేకాకుండా పలు సినిమాలకు డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారట.

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోలో పెద్దగా కనిపించని హైపర్ ఆది ఢీ షోలో మాత్రం కనిపిస్తూ ఉన్నారు.. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీల షో మాత్రమే చేస్తూ ఉన్నారు హైపర్ ఆది. కొన్ని స్పెషల్ ఈవెంట్లలో కనిపిస్తూ ఉన్నారు. హైపర్ ఆది పెళ్లి గురించి చాలా రోజులుగా మన రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అతడు ఫలానా అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. హైపర్ ఆది ఎవరితో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఢీ షోలో భాగంగా వచ్చే బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్లో.. ఏకంగా ఒక అమ్మాయిని తనకు జంటగా తీసుకువచ్చారు. ఆమె తన ప్రియురాలుగా పరిచయం చేశారు.అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా హైపర్ ఆది తన ప్రేమను చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా ఇక్కడ చాలా అవమానం జరిగిందని తెలియజేస్తూ ఇక్కడే నిరూపించాలని తెలియజేస్తూ ఉండగా వెంటనే హైపర్ ఆది కీ ఆ అమ్మాయి ముద్దు పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: