టీవీ: ఆ డైరెక్టర్ సీన్ చెబుతానని రేప్ చేశాడు - బుల్లితెర నటి..!
అలా బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం అనే సీరియల్స్ లో నటించి అలరించింది.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలిత మాట్లాడుతూ.. నేను మలయాళం లో సినిమాలు చేయడానికి మొదటి సారి అక్కడికి వెళ్లాను అందులో రేప్ సీన్ గురించి వివరించాలని నన్ను గదిలోకి రమ్మన్నారు. అయితే నేను వెళ్ళాక అసిస్టెంట్ డైరెక్టర్ ఆ రూమ్ గడియ పెట్టేసాడు. ఇక నేను ఎంత ప్రయత్నం చేసినా సరే నన్ను తప్పించుకోనివ్వకుండా చేసి నన్ను రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఇంతవరకు నేను ఎక్కడా ఎవరితోనో చెప్పలేదు.ఇప్పుడు చెబుతున్నాను అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయింది.
అయితే ఆ రేప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆరు నెలల్లోనే మరణించాడు అని మరొకవైపు వెల్లడించింది జయలలిత. నేను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరు పెట్టుకోవడం.. వ్యాంప్ పాత్రలు చేయడంతో ఆమె అభిమానులు చాలా హర్ట్ అయ్యి నా ఇంటిపై దాడులు కూడా చేశారు అంటూ జయలలిత తెలిపారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.వీరే కాకుండా ఇలా ఇబ్బంది పడ్డవారు చాలామందే ఉన్నారని చెప్పవచ్చు..