టీవీ: వారి చేతిలో వారం పాటు టార్చర్ అనుభవించానంటున్న సుమ.. కారణం..?
ఇక ఈమె ఇండస్ట్రీలో ఉన్నా.. ప్రారంభం నుండి నేటి వరకు ఎంతో మంది కొత్త యాంకర్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఏ ఒక్కరు కూడా సుమా రేంజ్ కి చేరుకోలేకపోయారు. అందుకే యాంకరింగ్ రంగంలో ఆమెని మహారాణి అని పిలుస్తూ ఉంటారు. టైమింగ్ తో కూడుకున్న పంచులు వేయడం వల్ల ఇప్పటికీ కూడా టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనడంలో సందేహం లేదు. ఇంతటి ఉన్నతమైన స్థానానికి చేరుకున్న సుమ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది.
రాజీవ్ కనకాలను తాను ప్రేమిస్తున్నట్టు ఇంట్లో చెప్పగానే సుమ తల్లిదండ్రులు అసలు ఒప్పుకోలేదట. మరొక పక్క రాజీవ్ కనకాల కుటుంబంలో మాత్రం సుమాతో పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ సుమా తల్లిదండ్రులు మాత్రం రాజీవ్ కనకాలతో మాట్లాడడానికి వీలులేదని సుమను ఒక వారం రోజులపాటు గదిలో నిర్బంధించారట. ఇక రాజీవ్ కనకాలను తలుచుకుంటూ తిండి పానీయాలు కూడా ముట్ట లేదట సుమ. ఇక తర్వాత ఆమె పట్టుదల, ప్రేమ అన్నింటిని గమనించిన ఆమె తల్లిదండ్రులు చివరికి రాజీవ్ కనకాలతో పెళ్లికి ఒప్పుకున్నారు. అలా వీరిద్దరి దాంపత్య జీవితం కొనసాగి ఇప్పుడు అన్యోన్యంగా కొనసాగుతోంది. వీరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు.