టీవీ: వారే నా కెరియర్ ను తొక్కేశారు బ్రహ్మముడి సీరియల్ నటి..!

Divya
ఎన్నో సినిమాలు సీరియల్స్ లో నటించి తనకంటూ అద్భుతమైన పేరును దక్కించుకున్న రాగిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల కాలంలో బ్రహ్మముడి సీరియల్ లో కనకం అక్క మీనాక్షి క్యారెక్టర్ తో మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను పలకరించిన ఆమె తన జీవిత విశేషాల గురించి వెల్లడించింది. అమృతం, రాధా -  మధు వంటి సీరియల్స్ లో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె బ్రహ్మముడి సీరియల్ లో అటు అమాయకత్వం, ఇటు చెల్లి అంటే ప్రేమ చూపించే క్యారెక్టర్ లో అద్భుతంగా నటించారు

ఇప్పటివరకు 190 కి పైగా సినిమాలు,  550 కి పైగా సీరియల్స్ లో నటించిన రాగిణి తన కెరియర్ విషయాలు ఎత్తుపల్లాలు తన జీవితంలో ఎదుర్కొన్న కన్నీటి సంఘటనల గురించి వెల్లడించింది. " నా కెరియర్ లో మొదటి నుంచి ఎప్పుడు కూడా ఇంత పారితోషకం కావాలని డిమాండ్ చేయలేదు. ఎంత ఇస్తే అంతే తీసుకున్నాను. రూ .300 ఇస్తామన్నా కూడా షూటింగ్ కి వెళ్లాను. ఒకసారి రాత్రి షూటింగ్ నుంచి వచ్చాక తినడానికి తిండి లేక మంచినీళ్లు తాగి పడుకున్నాను.  అమ్మ నాన్నలకు నేను 12వ సంతానాన్ని.. మేము మొత్తం 13 మంది.. అందుకే నాకు చదువుకునే అదృష్టం లభించలేదు. ఇక అమ్మానాన్నలను నేనే చూసుకున్నాను.

కుటుంబంలో 12 వ దాన్ని కావడంతో నాకంటే ముందు ఉన్న అక్కల పిల్లలతోనే నేను కూడా పెరిగాను. అయితే ఒక అక్క చనిపోవడంతో వాళ్ళ పిల్లలను నేనే పెంచాను. చదువుకోకపోయినా సరే వాళ్ళను నేను కష్టపడి చదివించాను . పిల్లలు ముగ్గురు కూడా సాఫ్ట్వేర్లు అయ్యి లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. వారి పెళ్లి, భవిష్యత్తు గురించి ఆలోచించి నాకు పెళ్లి ఆలోచన రాలేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు.. నన్ను చూసి అందరూ హీరోయిన్ అయ్యే టాలెంట్ ఉందని అనేవారు కానీ పిల్లల బాధ్యతల కారణంగా చెప్పే వాళ్ళు లేక ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోయాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: