టీవీ: భారీగా డిమాండ్ చేస్తున్న నాగార్జున.. బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే..?
బిగ్ బాస్ మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేశారు. అంతేకాదు ఓటీటీ వెర్షన్ కి కూడా ఆయనే హోస్ట్ గా చేయడం జరిగింది. ఇప్పుడు ఏడవ సీజన్ నుంచి ఆయన తప్పుకుంటున్నారు అని వార్తలు వచ్చినా చివరికి ఆయనే చేస్తున్నట్లు ప్రోమోలు కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున ఈ సీజన్ సెవెన్ కి భారీగా డిమాండ్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మూడవ సీజన్ కి రూ.5 కోట్లతో సరిపెట్టుకున్న నాగార్జున ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లకు పైగానే పారితోషకం అడుగుతున్నట్లు సమాచారం.
నిర్వాహకులు కూడా వేరే ఎవరూ లేని పక్షంలో ఇప్పుడు నాగార్జునని తీసుకుంటున్నారు కాబట్టి ఆయన అడిగినంత ఇవ్వడానికి వీరు వెనకాడడం లేదు. వాస్తవానికి వారంలో శని, ఆదివారాలు మాత్రమే నాగార్జున మనకు స్క్రీన్ పై కనిపిస్తారు. మరి కేవలం 15 వారాలపాటు కొనసాగే ఈ షో కి దాదాపు రూ .20 కోట్లకు పైగా అడుగుతున్నారంటే ఇక ఏ రేంజ్ లో ఆయన డిమాండ్ చేస్తున్నారో అర్థం చేసుకో వచ్చు. ఏది ఏమైనా నాగార్జున ఈ షో ద్వారా ఈసారి భారీగానే వెనకేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.