టీవీ: బిగ్ బాస్ లోకి జబర్దస్త్ కమెడియన్..!

Divya
తెలుగు బుల్లితెర రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో 6 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ కి కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ తో సరికొత్తగా ప్రేక్షకులకు వినూత్నమైన ఆనందాన్ని కలగజేయడానికి ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి ఎవరు రాబోతున్నారు..? హోస్ట్ ఎవరు ? అంటూ రకరకాలుగా అభిమానులలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి హోస్ట్ గా నాగార్జున రాబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారగా ఇప్పుడు అదే నిజమంటూ అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయింది. మరి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనే విషయానికి వస్తే.. ముందుగా మొగలిరేకులు సీరియల్ హీరో సాగర్ మొదలుకొని దీపిక పిల్లి, బుల్లెట్ భాస్కర్ ,దుర్గారావు దంపతులు , ఎస్తేర్, నోయెల్, ఈటీవీ ప్రభాకర్ తో పాటు మరికొంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈసారి ఊహించని విధంగా హౌస్ లోకి 20 మంది కంటెస్టెంట్లను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హౌస్ లోకి మరో కొత్త కంటెస్టెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు జబర్దస్త్ ద్వారా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నరేష్.. పొట్టి నరేష్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈయన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా రాబోతున్నట్లు దాదాపు కన్ఫామ్ అయినట్లు సమాచారం. మరి నరేష్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: